తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు పోటీల్లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గురువారం నాడు ఉదయం రాహుల్ గాంధీ గురువారం నాడు మధ్యాహ్నం మధురైకి చేరుకొన్నారు.
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు పోటీల్లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గురువారం నాడు ఉదయం రాహుల్ గాంధీ గురువారం నాడు మధ్యాహ్నం మధురైకి చేరుకొన్నారు. మధురై నుండి అవనిపురానికి రాహుల్ గాంధీ చేరుకొన్నారు. అవనిపురంలో జల్లికట్టు పోటీలను రాహుల్ గాంధీ తిలకించారు.
త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికలకు ముందు జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో రాహుల్ గాంధీ పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు. తమిళ సంస్కృతిని నిలబెట్టడం, రక్షించడం తన విధి అని ఆయన స్పష్టం చేశారు.
తమిళ సంస్కృతి, చరిత్రను జల్లికట్టులో తాను చూస్తున్నానని ఆయన చెప్పారు. ఎద్దులు, యువకుల భద్రతకు భరోసా ఇచ్చి జల్లికట్టును క్రమపద్దతిలో సురక్షితంగా నిర్వహించడం చూసి తనకు సంతోషంగా ఉందని రాహుల్ గాంధీ చెప్పారు.
తమిళ భాష, సంస్కృతి, చరిత్ర భారతదేశ భవిష్యత్తుకు ముఖ్యమైనవని ఆయన తెలిపారు. తమిళుల ప్రేమ, ఆప్యాయతను తాను పొందానని ఆయన చెప్పారు. వారితో నిలబడి వారి సంస్కృతిని కాపాడుకోవడం తన కర్తవ్యమని అందుకే తాను ఇక్కడికి వచ్చినట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు.
రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలను ఆ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది.కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జల్లికట్టుపై నిషేధించింది.జల్లికట్టుపై నిషేధానికి మద్దతిచ్చిన ఐదేళ్ల తర్వాత రాహుల్ గాంధీ రావడాన్ని బీజేపీ తప్పుబట్టింది.
తమిళనాడులో పొంగల్ సమయంలో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. జల్లికట్టు పోటీలను తమిళనాడు ప్రజలు సంప్రదాయ ఉత్సవంగా భావిస్తారు.
2021 లో రాహుల్ గాంధీ తమిళనాడులో రాజకీయ యాక్టివిటీ చోటు చేసుకొంది. రాష్ట్రంలో ఏప్రిల్, మే మాసంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, కేరళలలో కూడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
మధురైలో జిల్లాలోని అవయానిపురంలో జల్లికట్టు పోటీల్లో పాల్గొనడం ద్వారా బీజేపీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే రైతులకు తన నైతిక మద్దతు ఇస్తారని గతంలో తమిళనాడు అధ్యక్షుడు కె.ఎస్. అళగిరి ప్రకటించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 14, 2021, 2:01 PM IST