Rahul Gandhi: త్రివర్ణ పతాకం పేరుతో పేదలకు రేషన్ ఇవ్వ‌కుండా బదులు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆరోపణపై కేంద్రం స్పందించింది. 'రేషన్ కోసం త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయాల‌నే ఆదేశాలు జారీ చేయలేదని కేంద్రం స్ప‌ష్టం చేసింది. 

Rahul Gandhi: 75వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే అనేక మంది జాతీయ జెండాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నారు. అయితే.. ఈ క్యాంపెయిన్ కు ప్రసంశ‌ల‌తో పాటు.. విమ‌ర్శ‌లు కూడా వస్తున్నాయి.

 జెండాలు కొనకుంటే రేషన్‌లోని కొన్ని సరుకులను ఇవ్వడం లేద‌నే ఆరోప‌ణ‌లపై కేంద్ర స్పందించింది. జాతీయ జెండాను కొనుగోలు చేసేవారికే రేషన్ ఇవ్వాలనే రేషన్ షాపు యజమానులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన రేషన్ దుకాణ యజమానిపై కూడా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

త్రివర్ణ పతాకం పేరుతో పేదలకు రేషన్‌ ఇచ్చే బదులు రూ.20 దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం ఆరోపించారు. 20 రూపాయలకు త్రివర్ణ పతాకాన్ని బలవంతంగా కొనుగోలు చేస్తున్నారని కొందరు రేషన్ కార్డు హోల్డర్లు ఫిర్యాదు చేస్తున్న వీడియోను కూడా ఆయన పంచుకున్నార‌ని తెలిపారు.

రాహుల్ గాంధీ ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన ప్ర‌భుత్వం... త్రివ‌ర్ణ ప‌తకాన్ని కొనుగోలు చేసిన వారికే రేష‌న్ ఇవ్వాల‌నే సూచనలేవీ ఇవ్వలేదనీ, దాదాపు 80 కోట్ల మంది ప్రజలు ప్రతినెలా ఎలాంటి ఆటంకాలు లేకుండా రేషన్ పొందుతున్నారని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వును ఉల్లంఘించి వాస్తవాలను తప్పుగా చూపించినందుకు రేషన్ దుకాణం లైసెన్స్ ను తొలగించ‌బ‌డుతుంద‌నీ, రేషన్ కార్డుదారుడు హర్యానాలోని కర్నాల్ జిల్లాలోని దాదుపూర్ గ్రామానికి చెందినవాడని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తించారు. సంబంధిత రేషన్ దుకాణం యజమాని వాస్తవాలను తప్పుగా చూపించారు.

జాతీయవాదం ఎప్పటికీ అమ్మబడదు: రాహుల్ గాంధీ

త్రివర్ణ పతాకం పేరుతో పేదలకు రేషన్ ఇవ్వడానికి బదులు బీజేపీ ప్రభుత్వం జాతీయ జెండాపై, పేదల ఆత్మగౌరవంపై దాడి చేస్తోందని రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. త్రివర్ణ పతాకం గర్వకారణం, అది ప్రతి హృదయంలో ఉంటుంది. జాతీయవాదాన్ని ఎప్పటికీ అమ్ముకోలేమని, రేషన్ ఇవ్వకుండా త్రివర్ణ పతాకం పేరుతో పేదల నుంచి 20 రూపాయలు దండుకోవడం సిగ్గుచేటని విమ‌ర్శించారు.


బీజేపీ ప్రభుత్వం త్రివర్ణ పతాకంతో పాటు దేశంలోని పేదల ఆత్మగౌరవంపై దాడి చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అతను షేర్ చేసిన వీడియోలో కొంతమంది రేషన్ కార్డు హోల్డర్లు త్రివర్ణ పతాకాన్ని 20 రూపాయలకు కొనమని బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేయడం చూడవచ్చు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి వరుణ్ గాంధీ కూడా బుధవారం వీడియోను పంచుకున్నారు. ప్రభుత్వం రేషన్ కార్డు హోల్డర్లను త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయమని బలవంతం చేస్తోందని ఆరోపించారు. 'హర్ ఘర్ తిరంగ' ప్రచారంలో భాగంగా ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.