Asianet News TeluguAsianet News Telugu

గుర్తు పెట్టుకోండి.. బీజేపీని గద్దె దించేది కాంగ్రెసే: రాహుల్‌గాంధీ 

నేటీతో భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ  అట్టడుగు స్థాయి ఉన్న కార్యకర్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. 

Rahul Gandhi addressed a press conference on Friday as Bharat Jodo Yatra completes 100th day.
Author
First Published Dec 16, 2022, 6:22 PM IST

భారత్ జోడో యాత్ర: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర శుక్రవారం (డిసెంబర్ 16)తో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జైపూర్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రకు మంచి ఆదరణ లభించిందన్నారు. 2023లో జరిగే రాజస్థాన్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని రాహుల్ గాంధీ దీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్ ఎన్నికల్లో ఎవరెవరికి పోటీ జరుగనున్నది అనే ప్రశ్నకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ..  తాను కాంగ్రెస్ అధ్యక్షుడిని కాదనీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అని.. ఎవరిని దారి దించనున్నారనేది వారిని అడగండని అన్నారు.

'అందరి మాట వింటాం'

సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ నేత సచిన్ పైలట్ వర్గీయుల ప్రశ్నపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మా పార్టీకి ఫాసిస్ట్ భావజాలం లేదు. ప్రజలు మాట్లాడాలనుకుంటే.. మేము అందరి మాట వింటాము. క్రమశిక్షణ విచ్ఛిన్నమైతే.. మేము చర్య తీసుకుంటామని అన్నారు. మహాత్మాగాంధీ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందనీ, కాంగ్రెస్ సైద్ధాంతిక పార్టీ అనీ,పెద్ద పార్టీలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. భారత్ జోడో యాత్రకు రాజస్థాన్‌లో అత్యుత్తమ మద్దతు లభించిందని రాహుల్ అన్నారు.

భారత్ జోడో యాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. హిందీ బెల్ట్‌లో యాత్రకు మద్దతు లభించదని కొందరు మిత్రులు చెప్పేవారు. కానీ, మాకు ఇక్కడే విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు.   కాంగ్రెస్ పనికిరాదని, వాడిపోయిందనేది తప్పుడు కథనమని రాహుల్ గాంధీ అన్నారు. తన మాటలను గుర్తు పెట్టుకోండని, బీజేపీని కాంగ్రెస్ కూల్చివేయబోతోందని అన్నారు. ఎందుకంటే పోరాటాన్ని వదిలిపెట్టని పార్టీ కాంగ్రెస్ అని రాహుల్ గాంధీ అన్నారు.


తిరుగుబాటుపై రాహుల్ గాంధీ ఏం చెప్పారు?

గెహ్లాట్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ప్రశంసించారు. అయితే.. కొంతమంది కరెంటు కోతలు, నీటిలో ఫ్లోరైడ్ గురించి కూడా ఫిర్యాదు చేశారని అన్నారు. దానిని సాధారణ సమస్యగా పేర్కొన్నాడు. సెప్టెంబరులో గెహ్లాట్ మద్దతుదారుల తిరుగుబాటుపై కొనసాగుతుందని ఆయన అన్నారు. నేడు నాయకులు ప్రజలకు దూరమయ్యారని అన్నారు. దూరంగా వెళ్లిపోయారనీ, కాంగ్రెస్ పార్టీ చాలా తప్పులు చేసిందని, రాబోయే కాలంలో కాంగ్రెస్ మాత్రమే బీజేపీని ఓడిస్తుందని అన్నారు.

బీజేపీ భయం, ద్వేషం సృష్టించిందని రాహుల్ గాంధీ అన్నారు. దాన్ని అంతం చేసేందుకే ఈ పాదయాత్ర జరుగుతోందని అన్నారు. ఈ ప్రయాణంలో తాను కోట్లాది మందిలో ప్రేమను చూశానని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఆప్, టీమ్‌ఏసీని కలిసిపని చేయనున్నారని ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు తనని కాదనీ,కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని అడగండని అన్నారు. 

చైనాతో గొడవ గురించి ఏం చెప్పారు

2 వేల చదరపు కిలోమీటర్లను చైనా తీసుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మన జవాన్లను కొడుతున్నారనీ,దేశం కూడా చూస్తోందని అన్నారు. ఎవరూ చూడటం లేదని అనుకోకండని అన్నారు. చైనా నుంచి వచ్చే ముప్పును దాచేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నిస్తోందని ప్రశ్నించారు. లడఖ్ వైపు యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. భారత ప్రభుత్వం ఈవెంట్ ఆధారంగా పని చేస్తుందనీ, కానీ.. వ్యూహాత్మకంగా పని చేయడం లేదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios