Asianet News TeluguAsianet News Telugu

జోరు పెంచిన రాహుల్ గాంధీ... విద్యార్థులతో స్టెప్పులు.. వీడియో వైరల్..

తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ విద్యార్థులతో ఆడిపాడారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులో ఎన్నికల నగారా మోగింది. దీంతో ఎన్నికల హడావుడి జోరందుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోరు పెంచారు. 

rahul gandhi 3 days tour in tamil nadu, dance with students video viral - bsb
Author
Hyderabad, First Published Mar 1, 2021, 3:06 PM IST

తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ విద్యార్థులతో ఆడిపాడారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులో ఎన్నికల నగారా మోగింది. దీంతో ఎన్నికల హడావుడి జోరందుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోరు పెంచారు. 

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమిళనాడులో మూడు రోజులపాటు పర్యటించానున్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ ర్యాలీలు, సభలతో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులతో ఆడిపాడారు. తమిళనాడులోని ములగుమూదుబ్స్ సెయింట్ జోసెఫ్స్ మెట్రిక్యులేషన్ విద్యార్థులతో కలిసిి డ్యాన్స్ చేశారు. 

పుష్-అప్స్, ఐకిడోతో అక్కడి విద్యార్థులతో హుషారుగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో కాంగ్రెస్ శ్రేణుల్లో, అభిమానుల్లో వైరల్‌గా మారింది. తమిళనాడులో జోరుగా పర్యటిస్తున్న రాహుల్ కు అక్కడి ప్రజలు ఘనస్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా నాగర్‌కోయిల్ వెళ్లేటప్పుడు ఆచంగులం గ్రామ రహదారిలో తాటి ముంజెలను ఆస్వాదిస్తూ అక్కడి ప్రజలతో కలిసిపోయారు. 

సోమవారం కన్యాకుమారిలో ప్రచారం చేస్తున్న రాహుల్ తమిళ ప్రజలు తప్ప మరెవరూ తమిళనాడును నడపలేరు అనేది చరిత్ర చెబతోంది. ఈ ఎన్నికల్లో కూడా ఇదే రుజువు కానుంది. తమిళనాడు ప్రజలకు నిజంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన జోస్యం చెప్పారు. 

కన్యాకుమారిలో రోడ్ షోలో పాల్గొన్న రాహుల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. త‌మిళ‌నాడు సంస్కృతిని కేంద్రం గౌర‌వించ‌దు.ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి మోదీకి ప్రతినిధిగా ఉంటూ ఆయ‌న ఏం చెబితే అది చేస్తారు. 

మోదీకి దాసోహం అనేవారు తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తమిళ సంస్కృతిని ఆర్ఎస్ఎస్ అవమానించే అవకాశాన్ని ముఖ్యమంత్రి ఇవ్వకూడదు. ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర అని మోదీ చెబుతూ  ఉంటారు. 

మరి తమిళం భారతీయ భాష కాదా? తమిళ చరిత్ర భారత చరిత్ర కాదా? అన రాహుల్ ప్రశ్నించారు. ఒక భారతీయుడిగా తమిళ సంస్కృతిని కాపాడడం తన విధి అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాగా తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 6న ఒకే దశలో జరగనున్నాయి. మే 2న ఓట్లు లెక్కింపు ఉంటుంది. 

ఈసారి బరిలో ప్రధానంగా కాంగ్రెస్ -డీఎంకే, బీజేపీ ఏఐఏడిఎంకె కూటమి హోరాహోరీగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios