గత ఏడాది ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన రాహుల్ గాంధీ ఏ విధంగా తన ప్రణాళికలను అమలు చేస్తూ వస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. పార్లెమెంట్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కౌగిలించుకోవడం దగ్గరి నుంచి తన ప్రసంగాల ద్వారా ప్రజలను ఉత్తేజితుల్ని చేసేవరకు రాహుల్ 'పప్పు' అనే ట్యాగ్ లైన్ ను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒక నాయకుడిగా ఎదిగారు.  

ఈ సెమీఫైనల్ గా పరిగణిస్తున్నటువంటి 5 రాష్ట్రాల్లో(తెలంగాణ - మిజోరాం - రాజస్థాన్ -మధ్యప్రదేశ్ - ఛత్తీస్ ఘడ్) కనుక కాంగ్రెస్ మెజారిటీ రాష్ట్రాలను గెలుచుకుంటే ఇప్పటివరకు ఫెడరల్ ఫ్రంట్ బ్యాక్ సీట్ లో ఉన్న కాంగ్రెస్ డ్రైవర్ సీట్ ను ఆక్రమిస్తుంది అనడంలో డౌట్ లేదు. మరి ఈ ఎన్నికల్లో ఫలితాల ద్వారా ఎలాంటి అడుగులు వేస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.