Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరులో చక్కర్లు కొట్టిన రాఫెల్ (వీడియో)

కొద్ది నెలలుగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రధాన అస్త్రంగా దొరికిన రాఫెల్ యుద్ధవిమానం బెంగళూరులో చక్కర్లు కొట్టింది. ప్రతిష్టాత్మక ఏరో ఇండియా-2019 ప్రదర్శనలో భాగంగా రాఫెల్‌ను ప్రదర్శించారు.

rafale jet fighter flies in bengaluru air show
Author
Bangalore, First Published Feb 20, 2019, 2:00 PM IST

కొద్ది నెలలుగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రధాన అస్త్రంగా దొరికిన రాఫెల్ యుద్ధవిమానం బెంగళూరులో చక్కర్లు కొట్టింది. ప్రతిష్టాత్మక ఏరో ఇండియా-2019 ప్రదర్శనలో భాగంగా రాఫెల్‌ను ప్రదర్శించారు.

ఏరో ఇండియాలో ప్రదర్శన ఇచ్చేందుకు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన రెండు రాఫెల్ జెట్ ఫైటర్లను బెంగళూరుకు తరలించారు. మరోవైపు ఏరో షోకు సన్నాహకంగా నిన్న జరిగిన విన్యాసాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు సూర్య కిరణ్ ఏరోబేటిక్ విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి.

ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ సాహిల్ గాంధీ దుర్మరణం పాలయ్యారు. ఆయన మరణానికి సంతాపంగా రాఫెల్ విమానాన్ని సాధారణ వేగంతో నడిపారు. ప్రమాదం నేపథ్యంలోనే సూర్య కిరణ్ ఏరోబేటిక్స్ బృందం ప్రదర్శనకు దూరంగా ఉంది.

రాఫెల్‌తో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తేజస్ కూడా ప్రదర్శనలో పాల్గొంది. లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు తేజస్‌ను భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ నామకరణం చేశావరు. ఈ సందర్భంగా అటల్‌‌జీకి నివాళుర్పించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios