ప్రముఖ స్టార్‌ హీరో మాధవన్‌ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. ఆయన కుమారుడు వేదాంత్‌ మాధవన్‌ ఖేలో ఇండియా గేమ్స్‌-2023లో రికార్డు స్థాయిలో పతకాలు సాధించాడు. ఈ పోటీల్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తోన్న వేదాంత్‌ మాధవన్ 5 స్వర్ణ పతాకలు, 2 రజత పతకాలతో సహా మొత్తం 7 పతకాలను గెల్చుకున్నాడు. 

ప్రముఖ సీని నటుడు మాధవన్ ప్రస్తుతం పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. ఆయన తనయుడు, ఎమర్జింగ్‌ స్విమ్మర్‌ వేదాంత్ మాధవన్ ఖేలో ఇండియా గేమ్స్ 2023లో రికార్డు స్థాయిలో పతాకాలను సాధించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 7 పతకాలను గెలుచుకున్నాడు. స్మిమింగ్ విభాగంలో మహారాష్ట్ర నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న వేదాంత్‌ మాధవన్ 5 స్వర్ణ పతాకలు, 2 రజత పతకాలతో సహా మొత్తం 7 పతకాలను గెల్చుకున్నాడు.

100, 200, 1500 మీటర్ల స్మిమింగ్ విభాగంలో వేదాంత్ స్వర్ణ పతకాలు సాధించగా..400, 800 మీట్లర​ రేసులో రెండు రజత పతకాలను కైవసం చేసుకున్నారు. ఇంతటీ ఘనత సాధించిన మాధవన్ తనయుడు వేదాంత్ ను ప్రశంసలతో ముంచెత్తున్నారు. దీంతో మాధవన్ ఆనందానికి అంతులేకుండా పోయింది. నిజమైన పుత్రోత్సాహంలో పోంగిపోతున్నారు.

మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ జాతీయ స్థాయి స్విమ్మర్. ఇప్పటికే పలు పోటీల్లో ఎన్నో పతకాలను కైవసం చేసుకున్నారు. తాజాగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 వేదాంత్ రికార్డు స్థాయిలో 5 స్వర్ణాలు, 2 రజతాలను పతకాలు కొల్లగొట్టాడు. ఈ సందర్భంగా మాధవన్ తన కొడుకు విజయాలను అభినందిస్తూ.. ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. వేదాంత్ ప్రదర్శనకు చాలా గర్వంగా ఉంది. దేవుని దయతో 100మీ, 200మీ, 1500 మీటర్లలో స్వర్ణం.. 400 మీటర్లు, 800 మీటర్లలో రజతం సాధించాడు. అని మాధవన్ ట్వీట్ చేశాడు.

అలాగే.. ఈ టోర్నీలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన మహారాష్ట్ర జట్టుకు హీరో మాధవన్ అభినందనలు తెలిపారు. ఈ గేమ్స్ లో ఆ జట్టు మొత్తం 161 పతకాలు సాధించింది. వీటిలో 56 స్వర్ణాలు, 55 రజతాలు, 50 కాంస్య పతకాలు ఉన్నాయి. బాలుర జట్టు స్విమ్మింగ్ ఛాంపియన్ ట్రోఫీ సాధించడం పట్ల మాధవన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ అద్భుత విజయం గురించి తెలుసుకున్న సినీ పరిశ్రమ సభ్యులతో పాటు నెటిజన్లు వేదాంత్ మాధవన్ కు అభినందనలు తెలిపారు. 

Scroll to load tweet…

వేదాంత్ మాధవన్ గురించి..

వేదాంత్ మాధవన్ గత కొన్నేళ్లుగా స్విమ్మింగ్ లో రాణిస్తున్నాడు.ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి అనేక అవార్డులను గెలుచుకున్నారు. కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో, పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో వేదాంత్ స్థానిక స్విమ్మర్ అలెగ్జాండర్ ఎల్ జార్న్‌ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

అంతకుముందు ఇదే మీట్‌లో 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో రజతం సాధించాడు. వేదాంత్ ఇంతకుముందు మార్చి 2021లో లాట్వియా ఓపెన్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు మరియు గత సంవత్సరం జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఏడు పతకాలు (నాలుగు రజతాలు మరియు మూడు కాంస్యాలు) సాధించాడు.