Asianet News TeluguAsianet News Telugu

'పుష్ప' సీన్ రిపీట్.. స్మగ్లర్లకు చుక్కలు చూపించిన పోలీసులు..  వీడియో

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్మగ్లర్లు ఎన్ని ఆవరోధాలు  స్రుష్టించిన ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.   

Pushpa movie police chased ganja smugglers in Alluri Sitarama Raju district KRJ
Author
First Published Sep 20, 2023, 2:11 AM IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 'పుష్ప' సినిమా సీన్ రిపీట్ అయింది. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు. చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు.

ఈ క్రమంలో సేమ్ పుష్ప సినిమా తరహాలో గంజాయి తరలించే సీన్ రిపిట్ అయింది. వెంబడిస్తున్న పోలీసులకు తప్పించుకోవడానికి స్మగ్లర్లు నానా ప్రయత్నాలు చేశారు. పోలీసులు ముందుకు రాకుండా.. పోలీసు వాహనానికి  అడ్డంగా గంజాయి మూటలను వేశారు. అయినా పోలీసులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎంత వేగంగా వెళ్లినా స్మగ్లర్లను మాత్రం వెంబడిస్తునే వెళ్లారు. ఈ క్రమంలో స్మగ్లర్ల నుంచి దాదాపు  రూ.కోటి విలువైన గంజాయిని సీజ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios