Asianet News TeluguAsianet News Telugu

'పుష్ప' చూసి ఎర్రచందనం స్మగ్లింగ్.. కట్ చేస్తే.. ఏడుగురి అరెస్ట్, రూ. కోటి విలువైన కలప స్వాధీనం

ఉత్తరప్రదేశ్‌లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలోని ఏడుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా మథురకు తరలించి అమ్మాలనుకున్నారు

Pushpa Inspired Smugglers Arrested On Tip Off From UP's Mathura
Author
First Published Dec 21, 2022, 2:55 AM IST

అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా చూసి స్ఫూర్తి పొంది ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలోని ఏడుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా మథురకు తరలించి అమ్మాలనుకున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ హైవే పోలీసులకు దొరికిపోయారు.

ఎస్‌టిఎఫ్, అటవీ శాఖ, ఠాణా హైవే పోలీసుల బృందం సోమవారం రాత్రి నిర్వహించిన తనిఖీలలో ఏడుగురు నిందితులు పట్టుబడ్డారు. కాగా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులంతా రెండు కార్లలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో వారి కార్ల నుంచి ఐదున్నర క్వింటాళ్లకు పైగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. దీని అంచనా వ్యయం దాదాపు కోటి రూపాయలు. పరారీలో ఉన్న నలుగురు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. పుష్ప సినిమా చూసి నిందితులు ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రారంభించినట్లు విచారణలో పోలీసులకు తెలిపారు.
 
ఈ ఘటనపై ఎస్‌ఎస్పీ శైలేష్‌కుమార్‌ పాండే మాట్లాడుతూ.. ఇన్నోవా, హోండా సిటీ కార్లలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం రాధా గుల్‌మోహర్‌ సిటీ సమీపంలో పట్టుకున్నట్లు తెలిపారు. 563 కిలోల ఎర్ర చందనం కలపతో పాటు స్మగ్లర్లను కూడా అరెస్టు చేశారు. స్మగ్లర్లు బృందావన్,మధురతో సహా పలు మతపరమైన ప్రదేశాలకు సరఫరా చేయబోతున్నారు.
 
ఏడుగురు స్మగ్లర్లు అరెస్ట్
 
ఈ ఘటనలో ఏడుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. నిందితుల వివరాలిలా ఉన్నాయి. దీపక్ అలియాస్ దల్వీర్, అజిత్ కుమార్ యాదవ్, సుమిత్ అలియాస్ రామ్, చంద్రప్రతాప్ అలియాస్ బబ్బు కాసుని,సుమిత్ దాస్, జితేంద్ర అలియాస్ జీతు యాదవ్,రంజీత్ ఖంఖేడా . పరారీలో ఉన్న నిందితులు కన్హా నివాసి రాందాస్, స్వరణ్ సింగ్ ఫౌజీ, ఢిల్లీ నివాసి రాణా, సతీష్ శర్మల కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎస్‌పి శైలేష్ కుమార్ పాండే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఎర్రచందనాన్ని తెప్పించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనీ, స్మగ్లర్లను పట్టుకున్న పోలీసు బృందానికి ఎస్‌ఎస్పీ రూ.25 వేల రివార్డును కూడా అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios