Asianet News TeluguAsianet News Telugu

జగన్నాధుడి ఆలయంలో అపశృతి: పగిలిన భక్తుల హృదయాలు

 రాష్ట్ర ప్రజల ఆరాధ్యదైవం జగన్నాథుడు కొలువుదీరిన శ్రీ మందిరం శిఖరాన ఉన్న పతితపావన పతాకానికి చెందిన కొయ్య ఒరిగింది. దీంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. 

Puri Jagannath Temple's Holy Flag  collapsed due to heavy rains lns
Author
Odisha, First Published May 12, 2021, 9:47 AM IST

భువనేశ్వర్: రాష్ట్ర ప్రజల ఆరాధ్యదైవం జగన్నాథుడు కొలువుదీరిన శ్రీ మందిరం శిఖరాన ఉన్న పతితపావన పతాకానికి చెందిన కొయ్య ఒరిగింది. దీంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. కాల వైశాఖి ప్రభావంతో మంగళవారం నాడు వీచిన గాలులకు ఆలయ శిఖరాన నీల చక్రానికి బిగించిన పతిత పావన పతాకం కొయ్య బిగువు కోల్పోయి పక్కకు ఒరిగింది.  

పతితుల్ని పావనం చేసే ఈ పతాకం ఒరగడం కరోనా సంక్రమణ వంటి విపత్కర పరిస్థితుల్లో ఏ ప్రకృతి వైపరీత్యానికి దారితీస్తోందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే  ఈ ఘటనతో దేవాలయంలో  ప్రతి రోజూ జరిగే కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం వాటిల్లలేదని ఆలయ వర్గాలు తెలిపారు. మంగళవారం నాడు పూరీ పట్టణంలో అరగంటపాటు భారీ వర్షాలు కురిశాయి.  

పూరీ జగన్నాథ ఆలయానికి  పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. జగన్నాథుడు కోరిన కోర్కెలను తీర్చుతాడని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు. స్వామి రథోత్వవానికి పెద్ద ఎత్తున  భక్తులు హాజరౌతారు. కరోనా కారణంగా రథోత్సవంపై గతంలో ఉన్నత న్యాయస్థానం ఆంక్షఁలు విధించిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios