Asianet News TeluguAsianet News Telugu

శ్రీ మందిరంలోకి దూసుకెళ్లిన బాబా.. హడలెత్తిన భక్తులు...

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయంలో ఓ బాబా కలకలం రేపాడు. నేరుగా గర్భాలయంలోకి దూసుకెళ్లి కాసేపు హల్ చల్ చేశాడు. పూరీ జగన్నాథుని దర్శనం కోసం తహతహలాడుతున్న భక్తజనానికి ఈనెల 23 నుంచి అంచెలంచెలుగా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు ఆలయ అదికారులు. ఈ సందర్భంగా ముందుగా జగన్నాథుని సేవాయత్‌ వర్గాలకు తొలి దర్శనం అవకాశం కల్పించారు. 

Puri Jagannath Temple reopens : One Baba Hulchul InTemple In Odisha - bsb
Author
Hyderabad, First Published Dec 25, 2020, 10:25 AM IST

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయంలో ఓ బాబా కలకలం రేపాడు. నేరుగా గర్భాలయంలోకి దూసుకెళ్లి కాసేపు హల్ చల్ చేశాడు. పూరీ జగన్నాథుని దర్శనం కోసం తహతహలాడుతున్న భక్తజనానికి ఈనెల 23 నుంచి అంచెలంచెలుగా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు ఆలయ అదికారులు. ఈ సందర్భంగా ముందుగా జగన్నాథుని సేవాయత్‌ వర్గాలకు తొలి దర్శనం అవకాశం కల్పించారు. 

కట్టుదిట్టమైన తనిఖీలతో స్వామివారి దర్శనం కోసం శ్రీమందిరం లోపలికి భక్తుల్ని అనుమతిస్తున్నారు. ఈ సమయంలో లొంగులి బాబా అకస్మాతుగా శ్రీ మందిరంలోకి దూసుకుపోయాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. స్థానిక లొంగులి మఠంలో బస చేస్తున్న బాబా వైష్ణవ్‌పురి జగన్నాథుని దర్శనం కోసం బయలుదేరాడు.

సింహద్వారం వద్ద భద్రత సిబ్బంది గుర్తింపు కార్డు కోసం బాబాను నిలదీశారు. అయితే ఆవరణలో ఉన్న పతిత పావనుని విగ్రహాన్ని దర్శిస్తూ.. కాసేపటికే అకస్మాతుగా చేతిలో ఢమరకం మోగించుకుని సింహద్వారం ఆవరణలో భద్రతా సిబ్బంది వలయం ఛేదించుకుని చొరబడ్డాడు. 

22 మెట్లు గుండా శ్రీమందిరం గర్భాలయానికి పరుగులు తీశాడు. బాబా వెంట ఆలయం భద్రత దళం జవాన్లు పరుగులు తీసిన బాబా సునాయాసంగా స్వామి సన్నిధికి  చేరుకున్నాడు. స్వామి దర్శనంతో తన్మయం చెందుతున్న తరుణంలో జవాన్లు అతన్ని అదుపులోకి తీసుకుని బయటకు తరలించారు. 

ఆ తరువాత బాబా మాట్లాడుతూ ఇతర సేవాయత్‌ల తరహాలో స్వామి సేవకులుగా తమకు గుర్తింపు జారీ అయినా.. దేవస్థానం పాలక యంత్రాంగం ఈ మేరకు మంజూరు చేయక పోవడంతో తమవర్గం స్వామి సేవలకు దూరం అవుతుందని వాపోయాడు. స్వామి కనులలో కనులు కలిపి దర్శించాలనే తపనతోనే శ్రీమందిరం లోపలికి చొరబడి మనసారా స్వామిని దర్శించుకున్నట్లు తెలిపాడు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios