చండీగఢ్: నోట్లో దుస్తులు కక్కి, చంపేసి కుమారుడి శవాన్ని బెడ్ బాక్స్ లో కుక్కి ప్రియుడితో లేచిపోయిన మహిళను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన చండీగఢ్ లో చోటు చేసుకుది.. ఈ మేరకు పంజాబ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు 

పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం... రాత్రి 8.50 గంటల ప్రాంతంలో చండీగఢ్ లోని బురెయిల్ గ్రామంలో మహిళ కుమారుడి నోట్లో గుడ్డలు కుక్కినట్లు పోలీసులకు సమాచారం అందింది.  పోలీసులు అతన్ని తమ వాహనంలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు చెప్పారు.

బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు ఆ మహిళను పట్టుకున్నారు. రెండున్నరేళ్ల బాలుడి శవం బెడ్ లోని కంపార్టుమెంటు లోపల కనిపించింది. బాలుడిని పడకలో కుక్కి ప్రియుడితో తన భార్య లేచిపోయిందని బాలుడి తండ్రి దశరథ్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. 

ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న దశరథ్ పని ముగించుకుని ఆదివారంనాడు ఇంటికి వచ్చారు. తన భార్య కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లిందని అనుకున్నాడు. ఉండబట్టలేక అతను భార్యకు ఫోన్ చేశాడు. కుమారుడు బెడ్ కంపార్టుమెంటులో ఉన్నాడని ఆమె చెప్పింది. 

దశరథ్ బెడ్ బాక్స్ తెరిచి చూశాడు. దాంతో కుమారుడు కనిపించాడు. ఆ వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేసి తన భార్య కుమారుడిని చంపి ప్రియుడితో లేచిపోయిందని ఫోన్ చేశాడు.