Asianet News TeluguAsianet News Telugu

రైలు ప్ర‌మాదంలో ముగ్గురు చిన్నారులు మృతి.. మ‌రొక‌రికి తీవ్ర గాయాలు

Kiratpur: పంజాబ్ లో ఆదివారం చోటుచేసుకున్న రైలు ప్ర‌మాదంలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరొ చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. సట్లెజ్ నదిపై వంతెన సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర వలస కూలీల నలుగురు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.
 

Punjab Train accident: Three children died in the train accident. Another one was seriously injured
Author
First Published Nov 27, 2022, 10:40 PM IST

Punjab Train accident:  పంజాబ‌ల్ లో వ‌ల‌స కూలీల కుటుంబాల‌కు చెందిన చిన్నారులు ఆడుకుంటుండ‌గా,  ప్ర‌మాద‌వ‌శాత్తు రైలు ఢీ కొని ముగ్గ‌రు ప్రాణాలు కోల్పోయారు. మ‌రొక చిన్నారి  తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో ప్రాణాలు నిలుపుకోవ‌డానికి పోరాడుతోంది. సట్లెజ్ నదిపై వంతెన సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర వలస కూలీల నలుగురు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఈ ప్ర‌మాదం చోటుచేసుకుందని స్థానికులు, అధికారులు పేర్కొన్నారు.  ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన చిన్నారుల వ‌య‌స్సు 7 నుంచి 11 ఏళ్ల మధ్య వయస్కులేనని పోలీసులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. పంజాబ్‌లోని కిరాత్‌పూర్ సాహిబ్‌లో న‌లుగురు చిన్నారులు ఆడుకుంటూ రైతు ప్ర‌మాదానికి గుర‌య్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు రైలు కిందపడి మృతి చెందగా, మరొకరికి తీవ్ర‌ గాయాలయ్యాయి. పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌లో ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు పిల్లలు మరణించ‌గా, ఒక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) జగ్జిత్ సింగ్ తెలిపిన‌ట్టు ఏఎన్ఐ నివేదించింది. పిల్ల‌లు రైల్వే ట్రాక్ స‌మీపంలోని కొన్ని చెట్ల నుండి బెర్రీలు తెచ్చుకోవ‌డానికి అక్క‌డ‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డే ఆడుకుంటుండ‌గా, ద‌గ్గ‌ర‌గా వ‌స్తున్న రైలును గ‌మ‌నించ‌లేదు. దీంతో రైలు వారిని ఢీ కొట్టింది. 

 

కాగా, ఈ రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌పై పంజాబ్ స‌ర్కారు విచార‌ణ‌కు ఆదేశించింది. పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. "చాలా విచారకరమైన సంఘటనలో, కిరాత్‌పూర్ సాహిబ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. విచారణకు ఆదేశించబడింది. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి" అని బెయిన్స్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారని తెలిపారు. నాలుగో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీవ్ర‌గాయాల‌తో ప్రాణాలు నిలుపుకోవ‌డానికి పోరాడుతోంద‌ని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమ్రీందర్ సింగ్ తన సంతాపాన్నితెలిపారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా వారికి బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌నీ, మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయ‌న కోరారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios