ప్రియుడు మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన హూషియాపూర్ జిల్లాకు చెందిన మనీషా ఫగ్వారాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటుంది.
చంఢీఘడ్: ప్రియుడు మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన హూషియాపూర్ జిల్లాకు చెందిన మనీషా ఫగ్వారాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటుంది. ప్రియుడు మోసం చేశాడని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
నా బోయ్‌ఫ్రెండ్ ఇందర్ నాకు ద్రోహం చేశాడు. ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీన్ని తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నా అని లేఖ రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా బాధితురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ లో ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి సూసైడ్ లేఖలో ప్రేమికుడి పేరు మాత్రమే ఉంది. కానీ, అతడి వివరాలు లేవు. బాధితురాలి ప్రియుడు ఎవరనే విషయమై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
