చంఢీఘడ్: పంజాబ్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్‌లో  శానిటరీ నాప్‌కిన్ కన్పించడంతో... ఆ శానిటరీ నాప్‌కిన్ ధరించిన విద్యార్థులు ఎవరనే విషయాన్ని తెలుసుకొనేందుకు గాను  టీచర్లు విద్యార్థినుల దుస్తులను విప్పారు. ఒక్కొక్కరిని తనిఖీ చేశారు. ఈ ఘటనరాష్ట్రంలో  సంచలనం నృష్టించింది. ఈ ఘటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

పంజాబ్ రాష్ట్రంలోని ఫిజికా జిల్లాలోని ఓ. ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్‌లో మూడు రోజుల క్రితం శానిటరీ నాప్‌కిన్ కన్పించింది. ఈ శానిటరీ నాప్‌కిన్ ను ఎవరు ఉపయోగించారోనని  టీచర్లు అడిగారు. అయితే శానిటరీ నాప్‌కిన్ వాడిన విషయాన్ని ఎవరూ కూడ బయటపెట్టలేదు.

దీంతో పాఠశాల ఆవరణలోనే విద్యార్థినుల ట్టలిప్పేసి మరీ శానిటర్ నాప్‌కిన్ ఎవరు వాడారనే విషయాన్ని కనుక్కొనేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు విద్యార్థినులు ఏడుస్తూ దుస్తులను విప్పేశారు. ఈ విషయమై విద్యార్థినులు  తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.  

దీంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు స్కూల్ టీచర్ల తీరును ఎండగట్టారు.ఈ విషయమై విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విర్యాదు ఆధారంగా ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు టీచర్లను  ఆ స్కూల్ నుండి  బదిలీ చేశారు. 

ఈ ఘటనపై  పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్  సీరియస్ అయ్యారు. సోమవారం నాటికి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను అందివ్వాలని ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.