లాక్ డౌన్: పోలీసును కారు బానెట్ పై లాక్కెళ్లిన విద్యార్థి
పంజాబ్ లోని జలంధర్ ఓ యువకుడు పోలీసుల పట్ల అత్యంత దారుణంగా వ్య.వహరించాడు, కారును ఆపడానికి ప్రయత్నించిన పోలీసుపై ఎక్కించడానికి ప్రయత్నించాడు. అయితే, అతను బానెట్ పైకి దుమికి ప్రాణాలు కాపాడుకున్నాడు.
జలంధర్: లాక్ డౌన్ వేళ పోలీసులు చాలా చిక్కులు ఎదుర్కుంటున్నారు. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి వస్తోంది. తాజాగా పంజచాబ్ వలోని జలంధర్ లో ఓ విద్యార్థి పోలీసును కారు బానెట్ పై లాక్కెళ్లాడు. చెక్ పోస్టు వద్ద కారును ఆపడానికి పోలీసు ప్రయత్నించాడు. అయితే, అతను కారును ఆపకుండా పోలీసును బానెట్ పై కొన్ని నిమిషాల పాటు లాక్కెళ్లాడు. అయితే, పోలీసులు ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
ఆ యువకుడిని పోలీసులు అన్మోల్ మెహమీగా గుర్తించారు. అతను నడిపిన ఎర్టిగా కారు అతని తండ్రి పర్మీందర్ కుమార్ పేరు మీద ఉంది. యువకుడిపై హత్యాయత్నం కింద కేసు పెట్టారు. ఆ సంఘటనకు సంబంధించిన 90 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ముల్క్ రాజ్ బానెట్ పై ఉండి కేకలు వేస్తూ ఉండడం కనిపించింది.
ఆ యువకుడిని పోలీసులు నిలువరించగలిగారు. అతన్ని పోలీసులు స్టేషన్ కు తోస్తూ తీసుకుని వెళ్లడం కూడా కనిపించింది. ఈ విధమైన చర్యలను ఏ మాత్రం సహించేది లేదని రాష్ట్ర పోలీసు చీఫ్ దినకర్ గుప్తా ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.
చెక్ పోస్టు వద్ద పోలీసులు కారను ఆపడానికి ప్రయత్నించారని, అయితే, కారును ఆపకుండా బారియర్ ను బ్రేక్ చేసి పారిపోయే ప్రయత్నం చేశాడని జలంధర్ పోలీసు కమిషనర్ చెప్పారు. విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ ముల్క్ రాజ్ పైకి అతను దాదాపుగా కారును ఎక్కించడాని అన్నారు. అయితే, బానెట్ పైకి దుమికి ముల్క్ రాజ్ ప్రాణాలు కాపాడుకున్నాడని ఓ ప్రకటనలో అన్నారు.