పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు గ్యాంగ్ స్టర్లకు మధ్య కాల్పులు జరుగుతన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రముఖ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్ హతమైనట్టుగా సమాచారం.

పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు గ్యాంగ్ స్టర్లకు మధ్య కాల్పులు జరుగుతన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రముఖ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న జగ్రూప్ సింగ్ రూప అనే గ్యాంగ్‌స్టర్ హతమైనట్టుగా పోలీసు వర్గాలు తెలిపినట్టుగా ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. వివరాలు.. అమృత్‌సర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని భక్నా గ్రామంలో సిద్దూ మూసేవాలా హత్య కేసులో అనుమానితులుగా ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు జగ్రూప్ సింగ్ రూప, మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుస్సాలకు పంజాబ్ పోలీసు విభాగానికి చెందిన యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్‌కు మధ్య బుధవారం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. 

పోలీసులకు, గ్యాంగ్‌స్టర్‌లకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. ఇంకా ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతుందని పోలీసులు వర్గాలు తెలిపాయి. 

ఇక, శుభదీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సిద్ధూ మూసేవాలా ఈ ఏడాది మే 29న మన్సా జిల్లాలోని అతని స్వగ్రామానికి సమీపంలో మే 29వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. కొందరు వ్యక్తులు అతడిని కాల్చిచంపారు. పంజాబ్, ఢిల్లీ, ముంబైకి చెందిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కెనడాకు చెందిన సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్, ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సమన్వయంతో ఈ హత్య వెనకాల ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పలువురుని అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో నిందితులుగా ఉన్న జగ్రూప్ సింగ్ రూప, మన్ను కుస్సా, దీపక్ ముండి పరారీలో ఉన్నారు. అయితే జగ్రూప్ సింగ్ రూప, మన్ను కుస్సాలు ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌లో పాల్గొంటున్నట్టుగా నివేదికలు పేర్కొంటుగా.. మూడో వ్యక్తి దీపక్ ముండి ఆచూకీ మాత్రం తెలియలేదు. ఇక, మూసేవాలపై మొదట ఏకే 47 రైఫిల్‌తో కాల్పుల జరిగిపాడని మున్ను కుస్సాపై ఆరోపణలు ఉన్నాయి.