Punjab Election2022: ప్రియాంక గాంధీ ఆమ్ఆద్మీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమ్ఆద్మీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి ఆవిర్భవించిందని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ నేతల నేపథ్యాలు, రాజకీయ పార్టీల గురించి ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రియాంక సంచలన వ్యాఖ్యలు చేసింది.
Punjab Election2022: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆమ్ఆద్మీ(Aam Aadmi Party) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమ్ఆద్మీ(Aam Aadmi Party) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) నుంచి ఆవిర్భవించిందని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ నేతల నేపథ్యాలు, రాజకీయ పార్టీల గురించి ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రియాంక సంచలన వ్యాఖ్యలు చేసింది.
పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ ఆదివారం పంజాబ్‌లోని కొట్‌కాపూరాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ పై విరుచపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ మితవాద హిందూ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుండి ఉద్భవించిందని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ ఏం చేసిందో అందరికీ తెలుసుననీ, విద్యా, ఆరోగ్య సంరక్షణ సంస్థల పేరుతో ఏమీ లేదనీ విమర్శించారు. రాజకీయ పార్టీలు, నాయకుల నేపథ్యాల గురించి తెలుసుకోవాల్సిన అవసరమేంతైనా ఉందని అన్నారు.
ఆప్ పార్టీ ఢిల్లీ ని మోడల్ స్టేట్ చేశామనీ, అటు బీజేపీ 2014లో గుజరాత్ ను మోడల్‌గా చేశామని, ప్రజలను మోసం చేస్తుందనీ, వారు చేసింది ఏం లేదనీ, ఆప్‌ని చూసి మోసపోకండని ప్రియాంక గాంధీ అన్నారు. కొట్కాపురా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజైపాల్ సింగ్ సంధూ కోసం ప్రచారం చేసిన ప్రియాంక గాంధీ.. పంజాబ్ ప్రభుత్వాన్ని పంజాబ్ నుండి నడపాలి, ఆప్ లేదా బిజెపి అధికారంలోకి వస్తే.. ఢిల్లీ నుంచి ప్రభుత్వం నడుస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం చన్నీ మీలో సామాన్యుడేనని ప్రియాంక గాంధీ వాద్రా ఉద్ఘాటించారు.
బీజేపీపై ప్రియాంక విమర్శలు
రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని ప్రశ్నించింది. రైతుల ఆందోళనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.అయినా.. రైతులు తలవంచలేదని ప్రసంశించారు. పంజాబీల సమస్యలు పంజాబీలకు తెలుస్తుందనీ. తనకు పంజాబీల బాధ అర్థమవుతోందని అన్నారు. ఎందుకంటే.. తన ఓ పంజాబీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, తన పిల్లలకు పంజాబీ రక్తం ఉందనీ, పంజాబీ ధైర్య సాహాసాలు తన పిల్లల్లో ఉన్నాయని అన్నారు.
రాహుల్ గాంధీ కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాననీ,. తన కోసం.. రాహుల్ కూడా తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని. తమ మధ్య భేదాభిప్రాయాలు లేవనీ, ఈ భేదాభిప్రాయాలు బీజేపీలోనే ఉన్నాయి. ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి అమిత్‌షాకి, సీఎం యోగికి మధ్య భేదాభిప్రాయాలున్నాయని ప్రియాంక ఆరోపించారు. గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండను ప్రియాంక గాంధీ లేవనెత్తారు. ఆ ఘటనలో నలుగురు రైతులను చంపిన కేసులో బిజెపి మంత్రి కుమారుడు ప్రధాన నిందితుడని ప్రస్తావించింది.
మాజీ కాంగ్రెస్ సభ్యుడు అమరీందర్ సింగ్, తన సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో తన సొంత పార్టీని ప్రారంభించారు. పంజాబ్ ఎన్నికల్లో పీఎల్‌సీ, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
