పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ గురువారం తన భార్య నవజ్యోత్ కౌర్ ఆరోగ్య వివరాలను పంచుకున్నారు.  నవజ్యోత్ కౌర్‌కు ఈ ఏడాది మార్చిలో స్టేజ్ 2 ఇన్వేసివ్ క్యాన్సర్ వున్నట్లు వైద్యులు గుర్తించారు. 

పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ గురువారం తన భార్య నవజ్యోత్ కౌర్ ఆరోగ్య వివరాలను పంచుకున్నారు. తన భార్యకు ఐదవ కీమో థెరపీ చికిత్స పూర్తయ్యిందని చెబుతూ దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఆమెను ఓదార్పు కోసం మనాలికి తీసుకెళ్లే సమయం ఇది అంటూ సిద్ధూ పేర్కొన్నారు. నవజ్యోత్ కౌర్‌కు ఈ ఏడాది మార్చిలో స్టేజ్ 2 ఇన్వేసివ్ క్యాన్సర్ వున్నట్లు వైద్యులు గుర్తించారు. దీనికి గాను ఆమెకు శస్త్రచికిత్స సైతం నిర్వహించారు 

Scroll to load tweet…

‘‘గాయాలు మానిపోయాయి.. కానీ ఈ పరీక్షకు చెందిన మచ్చలు మాత్రం మానసికంగా అలాగే వుంటాయి. ప్రస్తుతం ఐదవ కీమో జరుగుతోందని.. డాక్టర్ రూపిందర్ అనుభవం ఆమెకు ఎంతగానో ఉపయోగపడుతోంది. చేయి కదపలేకపోవడంతో చెంచాతో తినిపించా’’ నంటూ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు. నవజ్యోత్ కౌర్ ప్రస్తుతం హర్యానా రాష్ట్రం యమునా నగర్‌లోని వారమ్ సింగ్ ఆసుపత్రిలో డాక్టర్ రూపిందర్ బాత్రా సంరక్షణలో వున్నారు. చివరి కీమో తర్వాత తీవ్రమైన వాస్కులర్ రియాక్షన్‌లను దృష్టిలో వుంచుకుని.. మనాలికి తీసుకెళ్తున్నట్లు సిద్ధూ చెప్పారు. అలాగే తన భార్య చికిత్స వివరాలను ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 

కాగా.. 34 ఏళ్ల నాటి రోడ్డు ప్రమాదం కేసులో దోషిగా తేలిన సిద్ధూ పది నెలల పాటు జైలులో శిక్ష అనుభవించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయన చర్యలను సైతం ఎదుర్కొన్నారు.