ముఖ్యమంత్రి నివాసంలో విధులు నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్ డిఎస్పీ హర్జీందర్ సింగ్... పరిసరాల్లో చెత్తాచెదారం వేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన పేరు మీద చలాన్ జారీ చేశారు. 

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాస ప్రాంగణంలో చెతత్ వేసినందుకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ రూ. పది వేల జరిమానా విధించింది. ముఖ్యమంత్రి నివాసంలో విధులు నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్ డిఎస్పీ హర్జీందర్ సింగ్... పరిసరాల్లో చెత్తాచెదారం వేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన పేరు మీద చలాన్ జారీ చేశారు.

సిఎం అధికారిక నివాసం 7వ నెంబరు ఇంటి గేటు, సరిహద్దు గోడ సమీపంలో రోడ్డు పక్కన చెత్తను వేస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదులు అందుతున్నాయని, ఈ నేపథ్యంలో సిబ్బందికి జరిమానాలు విధించారని సమాచారం. అయితే సదరు అధికారి చలాన్‌పై సంతకం చేసేందుకు నిరాకరించడం గమనార్హం.

ఇదిలావుండగా, మున్సిపల్ కౌన్సెలర్ మహేశిందర్ సింగ్ చలాన్ జారీని ధృవీకరిస్తూ, సిబ్బంది, సందర్శకులచే పరిసరాలు చెత్తాచెదారం అవుతున్నాయని పొరుగువారి నుండి కార్పొరేషన్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. కార్పొరేషన్ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉండగా..ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కడుపునొప్పితో బుధవారం అర్థరాత్రి ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. సుల్తాన్‌పూర్‌లో నదిని శుద్ధి చేసిన 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ నీటిని తాగారు. నీరు శుద్దిగా ఉన్నాయి అని నిరూపించుకోవడానికి.. ఆయన ఆ నీటిని తాగడం గమనార్హం. ఆయన ఆ నీరు తాగిన తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.