పంజాబ్ రాష్ట్రంలో శిరోమణి అకాలీదల్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఈ దఫా తక్కువ సీట్లను దక్కించుకొనే అవకాశం ఉంది.

చంఢీఘడ్: Punjab రాష్ట్రంలో Shiromani Akali Dal తన ప్రాబవాన్ని కోల్పోయింది. గత కొంత కాలంగా ఆ పార్టీ తన ఓట్లను, సీట్లను కోల్పోతూ వచ్చింది. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయింది.

గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కూడా ఈ దఫా శిరోమణి అకాలీదళ్ పార్టీకి వచ్చేలా లేవని ఫలితాల సరళిని బట్టి తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

శిరోమణి అకాలీదళ్ పార్టీ ఏర్పాటై 2022 డిసెంబర్ 14వ తేదీ నాటికి వందేళ్లు. వందేళ్లు పూర్తి చేసుకొన్న పార్టీ క్రమంగా తన ప్రాబవాన్ని కోల్పోతుంది. అకాలీదళ్ పార్టీ సీనియర్లను విస్మరించి 2008లో parkash singh badal న తన కొడుకు Sukhbir Singh Badal కు బాధ్యతలు అప్పగించడంతో ఆ పార్టీ పతనం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2013 సెప్టెంబర్ మాసంలో శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్ గా ఎన్నికయ్యారు. అయితే ఆ సమయంలో పార్టీలో సీనియర్లను పట్టించుకోని కారణంగా పార్టీలో తిరుగుబాటు గా మారింది. SAD జనరల్ సెక్రటరీ కెప్టెన్ కన్వల్జిత్ సింగ్ ఈ విషయమై తన స్వరాన్ని పెంచాడు. అయితే 2009 మార్చి 29న చంఢీఘడ్-లూథియానా హైవే వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తో విబేధాల నేపథ్యంలో 2007లో ప్రకాష్ సింగ్ బాదల్ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా పనిచేసిన మన్‌ప్రీత్ సింగ్ బాదల్ 2010 అక్టోబర్ లో పార్టీని వీడాడు.2011 లో మన్ మన్ ప్రీత్ పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ ను ఏర్పాటు చేశాడు. మన్‌ప్రీత్ 2016లో తన పార్టీని Congress లో విలీనం చేశారు. 2020 జూలై మాసంలో సుఖ్‌దేవ్ సింగ్ ధిండా సేవా సింగ్ సెఖ్వాన్ సహా పలువురు సీనియర్ నేతలు శిరోమణి అకాలీదల్ నుండి వైదొలిగారు.

2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ రాష్ట్రంలో పదేళ్ల పాటు రాష్ట్రంలో ఆ పార్టీ పాలన సాగింది. అయితే ఈ సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం, Drugs వంటి అంశాలు అకాలీదళ్ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 2017 ఎన్నికల్లో ఆకాలీదళ్ 15 అసెంబ్లీ సీట్లకు మాత్రమే పరిమితమైంది.

కేంద్రంలో మూడు వ్యవసాయ చట్టాలను బీజేపీ తీసుకు రావడంతో శిరోమణి అకాలీదళ్ కేంద్రం నుండి వైదొలగించింది. ఎన్డీఏ నుండి కూడా అకాలీదల్ బయటకు వచ్చింది. ఈ ఎన్నికల్లో BSP తో అకాలీదలో పొత్తు పెట్టుకుంది. బీఎస్పీతో పొత్తు కూడా ఈ దపా ఆ పార్టీకి ఏ మాత్రం కలిసి రాలేదని ఫలితాల సరళిని బట్టి చూస్తే తెలుస్తుంది.పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని మోడీ కాన్వాయ్ నిలిపివేత అంశంపై అకాలీదళ్ కొంత బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది.

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమయింది. పంజాబ్ విషయానికి వస్తే ఇక్కడ ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో మొత్తం 117 స్థానాలకు ఫపోలింగ్ జరిగింది. మొత్తం 2.14 కోట్ల ఓటర్లు ఉండగా.. 72 శాతం పోలింగ్ నమోదైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఇది 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన పోలింగ్ శాతంతో పోలిస్తే తక్కువగా ఉంది. పంజాబ్‌లో 2017లో 77.4 శాతం పోలింగ్ నమోదైంది.

పంజాబ్‌లో మొత్తం 117 శాసనసభ స్థానాలు ఉండగా.. ఎన్నికల బరిలో మొత్తం 1,304 అభ్యర్థులు నిలిచారు. అయితే వీరిలో కేవలం 93 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. ఇక, పంజాబ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారన్ని నిలుపుకోవాలని చూస్తోంది. పంజాబ్‌లో వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎస్​ఏడీ బీజేపీ కూటమిని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓడించిం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​ 77 సీట్లలో, ఆప్​ 20 చోట్ల గెలిచింది. ఎస్​ఏడీ–బీజేపీ కూటమి 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈసారి పంజాబ్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్.. పంజాబ్‌‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక, సాగు చట్టాల విషయంలో బీజేపీకి దూరం జరిగిన ఎస్‌ఏడీ.. ఈ ఎన్నికలల్లో బీఎస్పీతో జట్టు కట్టింది. ఇక, బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, బాదల్ నేతృ‌త్వం‌లోని ఎస్‌‌ఏడీ (సం‌యు‌క్త)తో కలిసి బరి‌లోకి దిగింది.

పంజాబ్ ఎన్నికల బరిలో.. ప్రస్తుతం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. చౌమ్‌కౌర్ సాహిబ్, Bhadaur రెండు స్థానాల నుంచి బరిలో ఉన్నారు. పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.. అమృత్‌సర్ ఈస్ట్, మాజీ సీఎం అమరీందర్ సింగ్.. పటియాలా, శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్, ఆప్​ సీఎం అభ్యర్థి Bhagwant Mann.. ధురి, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్.. లాంబి, పంజాబ్​ బీజేపీ చీఫ్​ అశ్వనీ శర్మ.. పఠాన్‌కోట్ స్థానాల నుంచి ఎన్నిక బరిలో నిలిచారు.