Sidhu Moose Wala murder: ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా(28)ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆదివారం ఆయన ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా..మార్గమధ్యలో ఆయన్ను కాల్చి చంపారు. ఈఘ‌ట‌న వ‌ల్ల‌ పంజాబ్‌లోని అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నైతిక అధికారం కోల్పోయింద‌నీ.. వెంట‌నే అధికారం నుంచి  వైదొల‌గాల‌ని కాంగ్రెస్ డిమాండ్  చేసింది.   

Sidhu Moose Wala murder: ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూస్ వాలాను పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆదివారం ఆయన ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా..మార్గమధ్యలో జవహర్ కే గ్రామం వద్ద ఆయన్ను కాల్చి చంపారు. ఈ దాడిలో సిద్దూ స్నేహితులకు కూడా గాయాలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అతని భద్రతను ఉపసంహరించిన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఘ‌ట‌న వ‌ల్ల‌ పంజాబ్‌లోని అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నైతిక అధికారం కోల్పోయింద‌నీ.. వెంట‌నే అధికారం నుంచి వైదొల‌గాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.


డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (మాన్సా) గోబిందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. మూస్ వాలా (27) తన జీపులో త‌న స్వ‌గ్రామం వెళ్తుండ‌గా మార్గ మ‌ధ్యలో జవహర్ కే గ్రామం వద్ద గురు తెలియ‌ని దుండ‌గులు అత‌నిపై దాడి చేశార‌నీ, అతనిపై ప‌లు రౌండ్లు కాల్పులు జ‌రిపిన‌ట్టు తెలిపారు.

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ..కాంగ్రెస్‌ నాయకుడు, ప్రతిభావంతుడైన కళాకారుడు సిద్ధూ మూస్‌ వాలా హత్యతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాన‌ని, అత‌నికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు నైతిక‌ బాధ్య‌త‌గా ఆప్ స‌ర్కార్ అధికారం నుంచి వైదొల‌గాల‌ని డిమాండ్ చేశారు.

ఈ దారుణంపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ప్రియాంక గాంధీ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. 'ప్రతిభావంతులైన గాయకుడు, యూత్‌ ఐకాన్‌, కాంగ్రెస్‌ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారనే వార్త చాలా బాధాకరం. ఇది మనందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది' అని ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు.

Sidhu Moose Wala murderపై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ట్విటర్ వేదిక లో ఆప్ ప్రభుత్వంపై విరుచుక‌ప‌డ్డారు. భావవ్యక్తీకరణకు మించి షాక్ అయ్యాననీ, కాంగ్రెస్ #INCindiaలో ఒక మంచి స్టార్‌ని కోల్పోయింది, సిద్ధూ మూసీవ్లా కు భగవంత్‌మాన్ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకున్న 2 రోజులకే అత‌నిపై బుల్లెట్ల వర్షం కురిసింది. ఆప్ పంజాబ్ #AAPPunjab ప్రభుత్వం నైతిక అధికారాన్ని కోల్పోయింది. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయాలని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా.. సిద్ధూ మూస్ వాలా హ‌త్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పంజాబీలతో మంచి సంబంధాలున్నాయనీ, ప్రతిభావంతులైన కళాకారుడిని కోల్పోయామ‌నీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని ప్రి అభిమానులకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నానని తెలిపారు. 

మూస్ వాలా హత్య.. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి లొను చేసింద‌ని కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొంది. అతని కుటుంబసభ్యులకు, అభిమానులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఆయన ఇటీవలి ఎన్నికల్లో మాన్సా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి ఆప్‌కి చెందిన విజయ్ సింగ్లా చేతిలో ఓడిపోయారు.