కుల కట్టుబాట్లను మీరి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు గాను పెళ్లికొడుకు తండ్రికి కులపెద్దలు దారుణమైన శిక్షను వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లో ఈ అమానవీయ ఘటన జరిగింది. ఓ దళిత యువకుడు ముస్లిం యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.. గ్రామ కట్టుబాట్లు.. కులాన్ని కాదని కులాంతర వివాహం చేసుకునాడని ఆగ్రహించిన గ్రామపెద్దలు పంచాయతీ పెట్టారు.

కొడుకు చేసిన నేరానికి శిక్షగా అతని తండ్రి చేత నేలపై ఉమ్మించి నోటితో నోకించారు.. అంతటితో ఆగని గ్రామస్థులు.. అతని భార్య, కూతుళ్లను వివస్త్రను చేసి పంచాయతీలో వూరు అందరి ముందు నగ్నంగా నిల్చోబెట్టారు. ఘటన అనంతరం పోలీసులను ఆశ్రయించిన అతను తన కొడుకు ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నందుకు తమ కుటుంబాన్ని దారుణంగా అవమానించి ఊరి నుంచి వెలివేశారని తెలిపాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.