Asianet News TeluguAsianet News Telugu

వీడియోలను లైక్ చేస్తే డబ్బులు.. సైబర్ నేరగాళ్ల మాయలో మహిళ.. చివరకు రూ. 24 లక్షలు స్వాహా..!

సైబర్ నేరగాళ్లు జనాలను మోసం  చేయడానికి సరికొత్త దారులను ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ నుంచి కేటుగాళ్లు రూ. 24 లక్షలు కాజేశారు.

Pune woman loses 24 lakh after she liked videos as part time job ksm
Author
First Published Apr 26, 2023, 3:38 PM IST

సైబర్ నేరగాళ్లు జనాలను మోసం  చేయడానికి సరికొత్త దారులను ఎంచుకుంటున్నారు. తాజాగా పార్ట్ టైమ్ జాబ్ పేరుతో మహారాష్ట్రలోని పుణెలో ఓ మహిళ నుంచి కేటుగాళ్లు రూ. 24 లక్షలు కాజేశారు. ఆన్‌లైన్ టాస్క్‌లు చేయడం వల్ల మంచి ఆదాయం వస్తుందనే మాయలో పడిన ఆమె.. మార్చి 28 నుంచి ఏప్రిల్ 22 మధ్య రూ. 23.83 లక్షలు పోగొట్టుకున్నారు. అయితే తొలుత కేటుగాళ్లు పార్ట్ టైమ్ జాబ్ పేరుతో యువతితో పరిచయం పెంచుకున్నారు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని కొన్ని వీడియోల లైక్ చేసే టాస్క్ అప్పగించి.. అందుకు గానూ ఆమె డబ్బుుల చెల్లించి నమ్మకం పెంచుకున్నారు. ఆ తర్వాత వారి ప్లాన్ అమలు మహిళను  చేసి బురిడి కొట్టించారు. వివరాలు.. బాధిత మహిళ పుణెలోని  ఎఫ్‌సి రోడ్‌కు చెందినవారు. ఆమె నేత్ర వైద్య నిపుణురాలిగా పనిచేస్తున్నారు. 

కొంతకాలం కిందట మహిళ మొబైల్‌కు ఇంటి నుండి పని చేస్తూ అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి  అవకాశం ఉందని మెజేజ్ వచ్చింది. దీంతో మహిళ ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానిక అవతలి  వ్యక్తులకు ఫోన్ చేసింది. అనంతరం పార్ట్ టైమ్ జాబ్‌గా ఆ పని చేయాలని నిర్ణయించుకున్నారు.

Also Read: ఇందారంలో మహేష్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. పెళ్లైనా తర్వాత కూడా ఫోన్ మాట్లాడిన యువతి..!!

టాస్క్‌లు ప్రారంభించిన తర్వాత.. కేటుగాల్లు ఆమెకు వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని వీడియోలపై లైక్ బటన్‌ను క్లిక్ చేయడం వంటి సాధారణ పనులను అందించారు. ఈ పనులు పూర్తి చేసినందుకు ఆమెకు రూ.10,275 చెల్లించారు. దీంతో కేటుగాళ్లు ఆమె నమ్మకం పొందారు. తర్వాత వారు ఆ మహిళకు ప్రీపెయిడ్ టాస్క్‌లను అందించారు. తమ క్రిప్టోకరెన్సీ స్కీమ్‌లో డబ్బు పెట్టుబడి పెడితే మరింత ఆదాయాన్ని వస్తుందని ఆమెను నమ్మించారు.. మరింత సులభంగా నగదు సంపాదించాలనే ఆశతో ఆ మహిళ డబ్బును డిపాజిట్ చేయడానికి అంగీకరించింది. ఈ క్రమంలోనే ఆమె రెండు బ్యాంకు ఖాతాలకు రూ.23.83 లక్షలు బదిలీ చేసింది.

ఆ మహిళ తన క్రిప్టోకరెన్సీ పెట్టుబడిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఆమె చెల్లింపును విడుదల చేయడానికి కేటుగాళ్లు  నిరాకరించారు. ఆమె నుంచి అదనంగా రూ. 30 లక్షలు డిమాండ్ చేశారు. ఆమె డబ్బులు చెల్లించడానికి నిరాకరించడంతో.. వారిని సంప్రదించలేకపోయింది. దీంతో తాను మోసపోయినట్టుగా గ్రహించిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios