మహారాష్ట్రలోని పూణెలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో ఓ మహిళను ఆమె భర్త కళ్లెదుటే అత్యాచారం చేశాడు.
పూణెలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. అప్పు తీర్చలేదని ఓ మహిళను ఆమె భర్త కళ్లెదుటే అత్యాచారం చేశాడు ఓ వడ్డీ వ్యాపారి. అంతటితో ఆగకుండా.. ఆ దారుణాన్ని తన ఫోన్ లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులకు తెలిసింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
40 వేలు అప్పుగా..
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ సంఘటన జరిగిందని హడప్సర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. బాధిత భార్యభర్తలిద్దరూ నిందితుడు ఇంతియాజ్ హెచ్. షేక్ నుంచి రూ.40వేలు రుణం తీసుకున్నారు. కానీ వారు అప్పును తిరిగి చెల్లించ లేకపోయారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనిపై ఆయన డబ్బు లేని విషయాన్ని పునరుద్ఘాటించారు. వారి సమాధానం విన్న షేక్ కోపోద్రిక్తుడైనాడు. కత్తి తీసి వ్యక్తిని చంపుతానని బెదిరించడం ప్రారంభించాడు.
ఈ తరుణంలో అతనికి అడ్డు వచ్చి .. ఆ వ్యక్తి భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని అంతటి తన సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. నిందితుడు తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని మహిళపై ఒత్తిడి తీసుకోచ్చాడు. కానీ ఆమె నిరాకరించింది. దీంతో ఆ వడ్డీ వ్యాపారి ఆ అసభ్యకరమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చివరకు ఆ భాదితురాలు ధైర్యం తెచ్చుకుని పోలీసులను ఆశ్రయించింది. హడప్సర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది.
ఈ కేసు గురించి పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర షెలాకే మాట్లాడుతూ, "మేము నిందితుడిని కనుగొని అరెస్టు చేసాము. అతన్ని కోర్టులో హాజరుపరిచాము, ఇది అతన్ని గురువారం వరకు రిమాండ్‌కు పంపించారు." అని తెలిపారు. నిందితులు మరేదైనా బాధితురాలిని ఇలాగే ట్రాప్ చేశారా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.
