Minor girl raped: రోజురోజుకు చిన్నారులు, మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాలు వావివరుసలు మరచి దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. కన్న కూతురిపైనే తండ్రి, ఇంటి సభ్యులు లైంగిక దాడులకు పాల్ప‌డిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

Minor girl raped: దేశంలో రోజురోజుకు చిన్నారులు, ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి.. మృగాళ్లు దారుణాలకు పాల్ప‌డుతున్నారు. వావివరుసలు, చిన్నాపెద్ద తేడా మరిచి కామాంధులుగా మారుతున్నారు. తాజాగా సమాజం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. కన్న కూతురిపైనే క‌న్న తండ్రి, ఇంటి సభ్యులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. తమ కామ‌వాంఛ తీర్చుకున్నారు. ఆ చిన్నారికి త‌న‌పై ఏం జ‌రుగుతుందో సైతం తెలియదు. ఎవ‌రికైనా చెప్పే బాగోద‌ని బెదిరించారు. ఇలా గ‌త కొన్నేండ్లుగా చిన్నారిని లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనే కార్యక్రమంలో స‌ద‌రు చిన్నారి త‌న గోడును వెల్లాగ‌క్కింది. దీంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ వార్త చ‌దువుతుంటేనే.. రక్తం మ‌రుగుతోంది కాదా.. ? అలాంటి వారిని న‌డి రోడ్డులో ఊరి తీయాలని, వారి తరుపున ఏ న్యాయవాది కూడా వాదించకూడ‌ద‌నేలా ఆగ్రహం వ్య‌క్తమ‌వుతోంది కాదా..? ఈ దారుణ ఘ‌ట‌న‌ మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత చిన్నారి (11) కుటుంబం బీహార్‌ నుంచి మహారాష్ట్రలోని పుణెకు వలస వచ్చింది. ఆ చిన్నారి చదువుతున్న పాఠశాలలో ఓ స్వచ్చంధ సంస్థ‌ ఇటీవ‌ల గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనే కార్యక్ర‌మం నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో అధికారులు ఆ చిన్నారిని ప్ర‌శ్నించ‌గా.. తన గోడును వెల్లడించింది.

గ‌త‌ ఐదేళ్లుగా త‌న‌పై తండ్రి, సోదరుడు, మేనమామ, తాతతో సహా ఆమె కుటుంబంలోని సభ్యులు అనేక సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డారని వెల్ల‌డించింది. 2017 నుంచి తండ్రి లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా.. తండ్రి, సోదరుడు వేరు వేరు సందర్భాల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికకు ఎనిమిదేళ్ల వయసు నుంచే లైంగిక దాడికి గుర‌వుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 

2020లో ఆమె సోదరుడు బాధితురాలిపై లైంగిక దాడి చేయగా.. తాత, మేన‌మామ కూడా మైనర్‌ను లైంగికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇది సామూహిక లైంగిక దాడి కాదని, మైనర్‌పై లైంగిక దాడులన్నీ వేర్వేరు సందర్బాల్లో జరిగాయని పూణెలోని బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్ ఎస్సై అశ్విని సాత్​పుతె పేర్కొన్నారు. 

గ‌త ఐదేండ్లుగా బాలికపై అత్యాచారం జ‌రిగిన‌ట్టు గుర్తించామ‌ని తెలిపారు. బాధిత కుటుంబ స‌భ్యులంద‌రూ దిన‌స‌రి కూలి గా కావ‌డంతో వారిని కేవ‌లం విచారణ జ‌రిపిన‌ట్టు, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ II) సాగర్ పాటిల్ తెలిపారు. ఈ క్రమంలో మైనర్‌ కుటుంబ సభ్యులపై పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. నేరం నిరూపితమ‌య్యితే.. దోహికి గరిష్టంగా జీవిత ఖైదు ప‌దే అవ‌కాశముంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న నేరస్థులకు వర్తించే జువెనైల్ జస్టిస్ చట్టం కింద విచారిస్తారు.

 ఐదేళ్ల క్రితం పాఠశాలల్లో ప్రవేశపెట్టిన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అవ‌గాహ‌న పూరిత కార్యాక్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. చాలా మంది పిల్ల‌ల‌కు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవ‌గాహ‌న లేద‌నీ, దీనిపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని బాధ్య‌త తల్లిదండ్రుల‌దేనని చైల్డ్ సైకాలజిస్ట్ కమలేష్ సోనావానే చెప్పారు.

గత ఏడాది కాలంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్ర‌కారం... దేశంలో నమోదైన పిల్లలపై జరిగిన నేరాలలో 38.8% లైంగిక వేధింపులకు సంబంధించినవే - నమోదైన లైంగిక వేధింపుల కేసుల సంఖ్య కూడా పెరిగింది. 2019 నుండి POCSO చట్టం కింద 96% లైంగిక వేధింపులే.