పుణె: మహారాష్ట్రలోని పుణెలో కారు డ్రైవర్ భీభత్సం సృష్టించాడు. మాస్క్ పెట్టుకోలేదని కారును ఆపేందుకు ప్రయత్నించినా కూడ కారును ఆపకుండా డ్రైవర్ ముందుకెళ్లాడు.,

కారు బానెట్ పై ట్రాఫిక్ పోలీసు పడినా కూడ పట్టించుకోకుండా కిలోమీటరు దూరం వరకు కారును ముందుకు పోనిచ్చాడు. ఇదే రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు కారును ఆపడంతో అతను కారును ఆపాడు.

అబా సావంత్ పుణెలోని పింపి చించవాడీ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.

గురువారం నాడు సాయంత్రం మాస్క్ లేకుండా  యువరాజ్ హనువంటే అనే వ్యక్తి కారును డ్రైవ్ చేస్తున్నాడు.ఈ విషయాన్ని గుర్తించిన సావంత్ కారును ఆపే ప్రయత్నం చేశాడు. అయితే యువరాజ్ కారును ఆపకుండా ముందుకు పోనిచ్చాడు.ఈ క్రమంలో కానిస్టేబుల్ కారు బానెట్ పై పడ్డాడు. 

కారును నిలిపివేయాలని కానిస్టేబుల్ అరుస్తున్నా కూడ పట్టించుకోకుండా యువరాజ్ కారును కిలోమీటరు దూరం వరకు తీసుకెళ్లాడు. 

కిలోమీటరు దూరం వెళ్లిన తర్వాత ఆయన కారును నిలిపివేశాడు. పోలీసులు అతనిపై  307, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కల్గించాడని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.కారు బానెట్ పై పడిన కానిస్టేబుల్ సావంత్ కాలు  కారు బంపర్ లో ఇరుక్కుపోయిందని  ట్రాఫిక్ ఎస్ఐ కూలే చెప్పారు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని పోలీసులు తెలిపారు.