Asianet News TeluguAsianet News Telugu

చందమామ ఫోటోలను అద్భుతంగా చిత్రీకరించిన 16ఏళ్ల కుర్రాడు..!

ఆకాశంలోని అందమైన చందమామ ఫోటోలను చిత్రీకరించి.. అందరి చేత ఔరా అనిపించుకున్నాడు. హై రిజల్యూషన్ తో చందమామ ఫోటోలను చిత్రీకరించాడు

Pune Boy Creates Stunning Picture of Moon by Processing 50,000 Images Totalling 186GB
Author
Hyderabad, First Published May 21, 2021, 8:28 AM IST

16ఏళ్ల కుర్రాడు అద్భుతం సృష్టించాడు. ఆకాశంలోని అందమైన చందమామ ఫోటోలను చిత్రీకరించి.. అందరి చేత ఔరా అనిపించుకున్నాడు. హై రిజల్యూషన్ తో చందమామ ఫోటోలను చిత్రీకరించాడు. ఆ ఫోటోలు చూసిన వారెవరైనా ఆశ్చర్యం వ్యక్తం చేయకుండా ఉండలేరు. పూర్తి వివరాల్లోకి వెళితే...

మహారాష్ట్రలోని పూణేకు చెందిన 16 ఏళ్ళ ప్రతిమేష్ జాజు అనే కుర్రాడు చందమామ ఫోటోలను హై-రిజల్యూషన్‌తో తీసి ప్రపంచాన్ని అబ్బురపర్చాడు. టెలిస్కోప్, స్కై వాచర్ సాయంతో పాటు సొంతంగా తయారు చేసుకున్న మరి కొన్ని పరికరాలతో ప్రతిమేష్ ఈ అద్భతాన్ని ఆవిష్కరించాడు. 

ఇటీవల ఓ రోజు రాత్రి సమయంలో పూర్తి చంద్రుడిని ప్రతిమేష్ ఫోటోలు తీశాడు. బ్లర్ కాకుండా చంద్రుడి స్వరూపం కనపడేలా ఈ ఫోటోలు తీసి ప్రశంసలందుకుంటున్నాడు. చందమామను దగ్గరనుంచి చూసిన అనుభూతి ఈ ఫోటోలు చూస్తే అనిపిస్తున్నదని ప్రపంచ మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios