జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో సూసైడ్ బాంబర్ అదిల్ అహ్మద్ దార్  జవాన్ల బస్సును ఢీకొట్టిన కారుకి ఓనర్ ఎవరో గుర్తించారు.

2011లో జలీల్ అహ్మద్ మారుతి ఈకోను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఈ వాహనం ఏడుగురి చేతులు మారినట్లు అధికారుల విచారణలో తేలింది. చివరిగా ఈ వాహనాన్ని సజ్జద్‌భట్ కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది.

ఇతని స్వస్థలం అనంత్‌నాగ్ జిల్లా, ప్రస్తుతం సజ్జద్‌భట్ ..సిరాజ్ ఉల్ ఉలూమ్ సంస్థలో పనిచేస్తున్నాడు. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసుల సాయంతో సజ్జద్‌భట్ ఇంటిలో ఎన్ఐఏ అధికారుల బృందం తనిఖీ చేసింది.

కొంతకాలం క్రితమే అతను జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు గుర్తించారు. భట్‌కు చెందిన కారులో భారీ పేలుడు పదార్థాలను అమర్చిన ఉగ్రవాదులు దాని సాయంతో సీఆర్‌పీఎఫ్‌ వాహన శ్రేణిని ఢీకొట్టారు. ఈ ఘటనలో 42 మంది జవాన్లు అమరులయ్యారు.