Asianet News TeluguAsianet News Telugu

పుల్వామా ఉగ్రదాడి: పాక్‌కు నదీ జలాలు కట్ చేసిన భారత్

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ను అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తున్న భారత్.. వ్యూహాత్మకంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ మీదుగా పాక్‌కు వెళ్లే సింధూనది జలాలను నిలిపివేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు

Pulwama Terror Attack: centre to stop indias share of river water to pakistan
Author
New Delhi, First Published Feb 21, 2019, 8:11 PM IST

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ను అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తున్న భారత్.. వ్యూహాత్మకంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ మీదుగా పాక్‌కు వెళ్లే సింధూనది జలాలను నిలిపివేసింది.

ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ‘‘సింధూ నది’’ జలాల విషయంలో మన దేశ వాటా నీటిని పాకిస్తాన్‌కు వెళ్లనీయకుండా ప్రధాని నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.

ఆ నీటిని తూర్పు నదుల్లోంచి మళ్లించి, జమ్మూకశ్మీర్, పంజాబ్‌లోని ప్రజలకు అందిస్తామన్నారు. రావి నదిపై షాపూర్-కాందీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని...యూజీహెచ్ ప్రాజెక్ట్ ప్రాంతంలో మన వాటా నీళ్ళని నిల్వ చేసి, కశ్మీర్‌కు అందిస్తామన్నారు.

అలాగే, మిగులు జలాలను రావి-బియాస్ లింక్ ద్వారా పరివాహక ప్రాంతాలకు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్‌లను జాతీయ ప్రాజెక్ట్‌లుగా ప్రకటిస్తున్నామని గడ్కరీ వెల్లడించారు.

1960లో సింధూ నది ఒప్పందం ప్రకారం సింధు బేసిన్‌లోని ఆరు నదుల నీటిని ఎలా వినియోగించుకోవాలనే దానిపై భారత్, పాక్ అప్పట్లో సర్దుబాటు చేసుకున్నాయి.

ఈ ఆరింటిలో మూడు నదులపై భారత్‌కు, మూడు నదులపై పాకిస్తాన్‌‌కు హక్కులు ఉన్నాయి. దీని ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు, జీలం, చీనాబ్, సింధు నదులపై పాక్‌కు హక్కులు ఉన్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios