న్యూఢిల్లీ: పూల్వామా ఉగ్రదాడికి కొద్ది క్షణాల ముందు ఓ జవాన్ తనభార్యకు పంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ‌వైరల్‌గా మారింది.పూల్వామా దాడి ఘటనలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే.

ఉగ్రదాడికి ముందు తాము ప్రయాణీస్తున్న వాహనంలోనే భార్య, కుటుంబసభ్యులతో పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుఖ్‌జిందర్ సింగ్ అనే జవాన్ మాట్లాడాడు. అంతేకాదు తాను  ప్రయాణం చేస్తూ ఆ ప్రాంతాలను తన మొబైలో చిత్రీకరించాడు. ఈ దృశ్యాలను తన భార్యకు పంపించాడు.

ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఉగ్రవాది జవాన్ల కాన్వాయ్‌ను ఢీకొట్టడంతో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ వీడియోను సుఖ్‌జిందర్ సింగ్ భార్య శుక్రవారం నాడు ఓ జాతీయ మీడియాకు విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

19 ఏళ్ల వయసులోనే  సుఖ్‌జిందర్‌ సింగ్‌ సీఆర్పీఎఫ్‌లో చేరారు.  76వ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టెబుల్‌గా విధులు నిర్వహించేవారు. అతనికి ఏడు నెలల కుమారుడు ఉన్నాడు.