ఈ నెల 31వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఈ నెల 31వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.తొలుత ఈ నెల 17వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకొంది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సమాచారం పంపింది. అయితే ఈ నెల 16వ తేదీ నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసింది.ఈ మేరకు రెండు రోజుల క్రితం కేంద్రం ఆయా రాష్ట్రాలకు సమాచారాన్ని పంపింది.
ఈ నెల 30 వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు.ఈ నెల 31వ తేదీన దేశంలోని అన్ని ప్రాంతాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 14, 2021, 5:53 PM IST