Farmers Protest: పంజాబ్ సరిహద్దులో రైతు ఆందోళనకారుడికి గుండెపోటు, మృతి

పంజాబ్, హర్యానాల సరిహద్దులోని శంభు ఏరియాలో ఓ రైతు ఆందోళనకారుడికి గుండె పోటు వచ్చింది. తీవ్రమైన గుండె పోటు రావడంతో తెల్లవారుజామునే హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, ఉదయం 6 గంటల ప్రాంతంలో ట్రీట్‌మెంట్ పొందుతున్నా.. పరిస్థితులు విషమించి 63 ఏళ్ల జ్ఞాన్ సింగ్ మరణించాడు.
 

pujab farmer protester died of heart attack at haryana punjab border kms

అన్నదాతలు మరో సారి కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం అయ్యారు. పోరుబాట పట్టారు. ఢిల్లీ ఛలో నినాదంతో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రైతులు ఆందోళనలకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా... చాలా మంది రైతులు రాష్ట్ర సరిహద్దుల వరకు వచ్చేశారు. పంజాబ్, హర్యానా సరిహద్దులోని శంభు, ఖనౌరీ వద్ద రైతులు మంగళవారం నుంచి మార్చ్ చేపట్టారు.

ఈ ఆందోళనలో పాలుపంచుకోవాలని పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన జ్ఞాన్ సింగ్ (63) భావించాడు. రెండు రోజుల క్రితమే ఆయన ఢిల్లీ ఛలో మార్చ్‌లో భాగంగా హర్యానాలోని అంబాలాకు సమీపంలో శంభు సరిహద్దు వద్దకు వచ్చారు. అక్కడ ఆందోళన చేస్తుండగా.. ఉదయం ఛాతిలో నొప్పి వచ్చింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతుండగా.. జ్ఞాన్ సింగ్‌ను పంజాబ్‌లోని రాజ్‌పురా సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆ సివిల్ హాస్పిటల్‌కు వచ్చారు.

వైద్యులు ఆయనను పటియాలాలోని రాజింద్ర ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించారు. జ్ఞాన్ సింగ్‌ను వెంటనే ఆ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వెంటనే ఆయనను ఎమర్జెన్సీ వింగ్‌లో అడ్మిట్ చేసుకున్నారు. అక్కడ ఒక అరగంట పాటు ట్రీట్‌మెంట్ అందిందో లేదో మరణించాడు. ‘జ్ఞాన్ సింగ్‌ను తీవ్రమైన గుండె పోటు వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడే ఆయనది క్రిటికల్ కండీషన్. వెంటనే ఎమర్జెన్సీ వింగ్‌లో అడ్మి్ట్ చేసుకున్నాం. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన మరణించాడు.

Also Read : Ajit Pawar: చీలిన పార్టే అసలైన ఎన్‌సీపీ.. తిరుగుబాటు చేసిన వారిపై అనర్హత వేటు వేయలేం: మహారాష్ట్ర స్పీకర్

సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చాలు రైతు మార్చ్‌కు పిలుపు ఇచ్చాయి. పంటకు కనీస మద్దతుకు చట్టబద్ధమైన గ్యారంటీ సహా పలు డిమాండ్లతో మరోసారి రైతులు ఆందోళనకు దిగారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios