Asianet News TeluguAsianet News Telugu

కాలేజీ అడ్మిషన్‌ల అప్లికేషన్ ఫీజు మాఫీ చేసిన పుదుచ్చేరి ప్రభుత్వం

కాలేజీ అడ్మిషన్‌ల కోసం విద్యార్థులు చేసుకున్న దరఖాస్తు రుసుమును మాఫీ చేయనున్నట్టు పుదుచ్చేరి ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ రూపొందించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. కరోనా కారణంగా ప్రజల ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

puducheryy waived application fee for college   admissions
Author
Puducherry, First Published Aug 13, 2021, 8:28 PM IST

చెన్నై: కరోనా కారణంగా వాటిల్లిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పుదుచ్చేరి ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. ఈ ఏడాది కాలేజీ అడ్మిషన్ కోసం చేసే అప్లికేషన్ ఫీజును మాఫీ చేయనున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ అడ్మిషన్ కమిటీ అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. అప్లికేషన్ ఫీజు మాఫీ కోసం ఈ వెబ్‌సైట్ ద్వారా అడ్మిషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. విద్యాశాఖ మంత్రి ఏ నమశ్వివాయం విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు.

నీట్ ఆధారిత ప్రవేశాలు కాకుండా ఇతర ప్రవేశాల కోసం ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఇందులోనూ ఎన్ఆర్ఐ, ఓసీఐలకు ఈ వెసులుబాటు వర్తించదు. సాదారణంగా ఈ ఫీజు రూ. 300 నుంచి రూ. 500 మధ్యలో ఉంటుంది. కాగా, నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత నీట్ ప్రవేశాల కోర్సులకు ఫీజు మాఫీపై ప్రకటన ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

ఈ ఏడాది కరోనా కారణంగా 12వ తరగతి విద్యార్థులందరినీ ప్రభుత్వం ప్రమోట్ చేసింది. దీంతో ఈ విద్యాసంవత్సరంలో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios