పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి నారాయణసామి నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరి 22న సాయంత్రం 5 గంటల్లోపు అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవలసి ఉంటుంది.

కాగా, ప్రతిపక్ష నాయకుడు ఎన్ రంగసామితో పాటు 13 మంది ఎమ్మెల్యేలు గురువారం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌ను కలిశారు. ఈ నేపథ్యంలోనే నారాయణ స్వామి ప్రభుత్వాన్ని విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 

ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో పడింది. అయితే ముఖ్యమంత్రి వి నారాయణస్వామి దీనిని ఖండించారు.

ఆ రెండు రాజీనామాలను ఇంకా ఆమోదించబడలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌కు పది మంది ఎమ్మెల్యేల బలం వుండగా, డీఎంకేకు ముగ్గురు, ఇండిపెండెంట్‌ ఒక్కరు వున్నారు.

ఇక విపక్షాల్లో ఏఐఎన్ఆర్‌సీకి 7, అన్నాడీఎంకేకు నలుగురు సభ్యులు వున్నారు. అయితే బీజేపీకి ముగ్గురు నామినేటెడ్ సభ్యులు వుండగా.. అయితే వారికి ఓటు హక్కు లేదని సీఎం నారాయణ స్వామి చెబుతున్నారు.