న్యూడిల్లీ: తెలుగులో ఇటీవల వచ్చిన స్పైడర్ సినిమాలో మాదిరిగానే ఓ సైకో కిల్లర్ న్యూడిల్లీ శివార్లలో దారుణానికి పాల్పడ్డాడు. ఏ కారణం లేకున్నా మనుషులను చంపి రాక్షసానందాన్ని పొందుతున్న సైకో విక్రుత చేష్టలు తాజాగా బయటపడ్డాయి. 

వివరాల్లోకి వెళితే... గురుగ్రామ్ లో ఈ నెల 23నుండి వరుసగా రెండు రోజులు దారుణ హత్యలు జరిగాయి. దీంతో పోలీసులు అప్రమత్తమైన పోలీసులు హత్యలు జరిగిన ప్రాంతాలకు సమీపంలో వున్న సిసి టివి పుటేజిని పరిశీలించారు. దీంతో బిహార్ కు చెందిన రాజి(22) ఈ దారుణాలకు పాల్పడినట్లు గుర్తించారు.

అతడిని పట్టుకుని విచారించగా ఈ హత్యలు చేయడానికి గల కారణాలను వెల్లడించాడు. అతడి మాటలు విని పోలీసులే విస్తుపోయారు. ''చిన్నప్పటి నుండి శారీరకంగా బాగా బలహీనంగా వుండటంతో దేనికీ పనికిరానని అందరూ ఎగతాళి చేసేవారు. అందుకే నేను ఏమయినా చేయగలనని నిరూపించాలనుకున్నారు. అందుకోసమే ఈ హత్యలు చేశాను. మనిషిగొంతు కోస్తుంటే చాలా ఆనందంగా వుంటోంది'' అంటూ సైకో కిల్లర్ పోలీసులకు తెలిపాడు.