Asianet News TeluguAsianet News Telugu

పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్ ప్రయోగం సక్సెస్: ఇస్రో ఛైర్మెన్ శివన్

పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్  నాలుగు దశలు విజయవంతమైనట్టుగా  ఇస్రో ఛైర్మెన్ శివన్ ప్రకటించారు.

PSLV C-51 satellite is in very good health says ISRO chairman sivan lns
Author
New Delhi, First Published Feb 28, 2021, 11:12 AM IST

శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్  నాలుగు దశలు విజయవంతమైనట్టుగా  ఇస్రో ఛైర్మెన్ శివన్ ప్రకటించారు.పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్ నాలుగు దశలు విజయవంతమైన తర్వాత ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.కక్ష్యలోకి అమెజానియా-1తో పాటు 18 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశించినట్టుగా ఆయన చెప్పారు. ఈ ప్రయోగాన్ని  సక్సెస్ చేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.

also read:శ్రీహరికోట: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ సీ-51 రాకెట్

బ్రెజిల్ దేశ సైన్స్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటన్ కూడ శ్రీహరికోటకు చేరుకొని ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. పీఎస్‌ఎల్‌వీ సీ-51 వాహకనౌక ద్వారా బ్రెజిల్ కు చెందిన అమెజొనియా -1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపినట్టుగా ఆయన చెప్పారు.ఇస్రో, బ్రెజిల్ ఉపగ్రహాన్ని ప్రయోగించడం చాలా గర్వంగా ఉందన్నారు. 

ఇస్రోలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఈ ఉపగ్రహాాలను ప్రయోగించారు. బ్రెజిల్ దేశ సైన్స్ , టెక్నాలజీ శాఖ మంత్రి మార్కోస్ ఈ ప్రయోగాన్ని స్పేస్ సెంటర్ నుండి ప్రత్యక్షంగా వీక్షించారు.ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో  ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios