దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఈ క్రమంలో వలసకార్మికుల కోసం ఎన్‌సిఆర్‌లో కమ్యూనిటీ కిచెన్‌లను తెరవాలని, స్వస్థలాలకు తిరిగి వెళ్లాలనుకునే కార్మికులకు రవాణా సౌకర్యం కల్పించాలని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

డ్రై రేషన్ అందించేటప్పుడు, రాష్ట్రాల అధికారులు “వలసజీవుల గుర్తింపు కార్డు కోసం పట్టుబట్టొద్దని, సమయానుసారం అందరు వలసకూలీలకు ఇవ్వాలని’ తెలిపింది. 

ఇటీవల కరోనా కేసుల్లో విపరీతమైన పెరుగుతుదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో  ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల కష్టాలను తీర్చడానికి  సుప్రీం కోర్టు గురువారం వారికి డ్రై రేషన్ అందించాలని మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. 

ఆత్మ నిర్భర్ భారత్ పథకం లేదా వేరే ఏ పథకం కిందనైనా వలసకార్మికులకు డ్రై రేషన్ అందేలా చూడాలని అపెక్స్ కోర్ట్ గురువారం కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలకు తెలిపింది. 

వలస కార్మికుల అవసరాలను తీర్చడానికి అవసరమైన మరియు తగిన చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిత్వ శాఖకు కేంద్రం సూచనలు జారీ చేయవచ్చని జస్టిస్ అశోక్ భూషణ్, ఎం ఆర్ షా ధర్మాసనం తెలిపింది.

మహమ్మారి నేపథ్యంలో వలసకూలీలకు ఆహార భద్రత, నగదు బదిలీ, రవాణా సదుపాయాలు , ఇతర సంక్షేమ చర్యలను తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలంటూ ముగ్గురు హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన దరఖాస్తుపై అత్యున్నత న్యాయస్థానం విచారించి ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 

"ఢిల్లీ ఎన్‌సిటి, యుపి , హర్యానా రాష్ట్రాల్లోని ఒంటరిగా ఉన్న వలస కార్మికుల కోసం కమ్యూనిటీ కిచెన్‌లు తెరవాలి, తద్వారా వారు, వారి కుటుంబ సభ్యులు రెండు పూటలా భోజనం చేయగలుగుతారు'' అని బెంచ్ తెలిపింది. అలాగే ఈ ప్రాంతాల్లోని ఇంటికి తిరిగి వెళ్లాలనుకునే వలస కార్మికులకు తగిన రవాణా సౌకర్యం కల్పించేలా చూడాలి" అని కూడా తెలిపింది.  జిల్లా పరిపాలన, పోలీసులతో సమన్వయంతో, ఇటువంటి చిక్కుకున్న వలస కూలీలను గుర్తించి, రోడ్డు లేదా రైలు ద్వారా వారి రవాణాను సులభతరం చేయాలని సూచించింది. 

వీటిమీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో రాతపూర్వకంగా తెలియజేయాలని కేంద్రంతో పాటు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.

ఒంటరిగా ఉన్న వలస కార్మికుల రవాణాకు సంబంధించి వలస కార్మికుల కష్టాలను తీర్చడానికి వారు తీసుకోవలసిన చర్యల వివరాలను తెలియజేస్తూ వారి సమాధానం దాఖలు చేయాలని మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ రాష్ట్రాలకు కూడా మేము నోటీసు జారీ చేసామని. ఒంటరిగా ఉన్న వలస కార్మికులకు డ్రై రేషన్,  భోజనం అందించే అంశాలు తెలపాలని కోరింది. 

నిరుడు మార్చి 24 న దేశవ్యాప్త లాక్ డౌన్ విధించినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడింది వలకకార్మికులేనని ధర్మాసనం గుర్తు చేసింది. ఉపాధి కోల్పోయి, ఆర్థిక అండ లేక, ఆహారం లేక దేవంలోని మెట్రో నగరాల్లోని అనేక మంది వలసకూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయాన్ని గుర్తు చేసింది. అంతేకాదు వలస కార్మికుల నుండి ఛార్జీలు వసూలు చేయవద్దని, వారు స్వస్థలాలకు వెళ్లే వరకు ఉచితంగా ఆహారాన్ని అందించాలని రాష్ట్రాలను కోరింది. 

ఈ ఉత్తర్వులో హైలైట్ చేసిన వివిధ అంశాలకు ప్రతిస్పందనగా అఫిడవిట్లు సమర్పించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు (యుటి) రెండు వారాల సమయం మంజూరు చేసినట్లు సుప్రీం కోర్టు తెలిపింది. వలసకూలీల సంక్షేమం కోసం అమల్లో ఉన్న వివిధ పథకాలను రికార్డ్ చేయమని కేంద్రానికి సూచించబడింది. 

నిరుడు సెప్టెంబర్ 1 న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాలు, యుటిలు తమ స్పందనలను దాఖలు చేయడానికి ఇంకా రెండు వారాల సమయం మంజూరు చేసినట్లు ధర్మాసనం పేర్కొంది. "చాలా రాష్ట్రాలు పైన పేర్కొన్న సమస్యలపై తమ నిర్దిష్ట స్పందనలను దాఖలు చేయలేదని, ఇప్పటివరకు దాఖలు చేసినవి సరిపోవు" అని తెలిపింది.

చివరి అవకాశంగా,ఢిల్లీ ఎన్‌సిటి, ఉత్తర ప్రదేశ్, హర్యానా, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకు మరో 10 రోజుల సమయం ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు లేదా తీసుకోవలసిన చర్యలు ఎంత సమయం లోపల తీసుకుంటారో తెలపాలని తెలిపింది.

COVID-19 అంటువ్యాధులు, దాని పర్యవసానాల నియంత్రణలను ప్రస్తావిస్తూ, కార్యకర్తలు  అంజలి భరద్వాజ్, హర్ష్ మాండర్, జగదీప్ చోకర్.. సంక్షేమ చర్యలను ప్రారంభించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ మీద జరుగుతున్న సుమోటు కేసులో తాజా మధ్యంతర పిటిషన్ను దాఖలు చేశారు.