Asianet News TeluguAsianet News Telugu

జూన్ 30న బ‌లం నిరూపించుకోండి.. ఉద్ద‌వ్ ఠాక్రేను కోరిన గ‌వర్న‌ర్ ? సోష‌ల్ మీడియాలో లేఖ వైర‌ల్..

మహారాష్ట్ర గవర్నర్ ను మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతోంది. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ కోరినట్టు అందులో ఉంది. అయితే అది ఫేక్ అని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది. 

Prove your strength on June 30 .. Governor seeks Maharashtra CM .. Letter goes viral on social media ..
Author
Mumbai, First Published Jun 29, 2022, 9:16 AM IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతోంది. ఇది గవ‌ర్న‌ర్ భగత్ సింగ్ కోష్యారీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకి రాసిన్న‌ట్టు గా క‌నిపిస్తోంది. దీని ప్ర‌కారం జూన్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు ఫ్లోర్ టెస్ట్ కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విధాన్ భవన్ సెక్రటరీని గ‌వ‌ర్న‌ర్ కోరారు. 

‘‘ అన్ని సంబంధిత విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఉద్ధవ్ ఠాక్రే మెజారిటీ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కోల్పోయారని నేను అభిప్రాయపడుతున్నాను. అందువ‌ల్ల భార‌త రాజ్యాగం అందించిన ఆర్టికల్ 174 r/w 175(2) ద్వారా వ‌చ్చిన అధికారాల‌ను ఉపయోగిస్తూ నేను నేటి లేఖ (29.06.2022) ద్వారా మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని 30.06.2022 ఉదయం 11 గంటలకు నిర్వ‌హించాల‌ని అదేశిస్తున్నాను. సభలో తన మెజారిటీని నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేకు సూచిస్తున్నాను.’’ అని విధాన్ భవన్ సెక్రటరీకి గ‌వ‌ర్న‌ర్ లేఖ పంపించిన‌ట్టు స‌ర్క్యులేట్ అవుతోంది.

చండీగఢ్ లో దారుణం.. ఆసుపత్రిలో మూడురోజుల శిశువును ఎత్తుకెళ్లిన శునకాలు..

కాంగ్రెస్ నాయకుడు అతుల్ లోంధే ఈ లేఖను షేర్ చేశారు. లేఖ వెనుక ఉన్న వ్యక్తిపై చర్య తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్‌ను డిమాండ్ చేశారు. ‘‘ ఈ నకిలీ లేఖను విడుదల చేసిన వ్యక్తిపై మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ చర్య తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగ సంస్థ, గవర్నర్ ను కూడా దుర్వినియోగం చేస్తున్నారు.’’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

ఈ లేఖ‌పై గ‌వర్న‌ర్ కార్యాల‌యం స్పందించింది. జూన్ 30వ తేదీన శాసనసభలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని మహారాష్ట్ర గవర్నర్ కోరుతూ సోషల్ మీడియాలో సర్క్యులేషన్ లో ఉన్న లేఖ నకిలీదని మహారాష్ట్ర రాజ్ భవన్ స్పష్టం చేసింది. కాగా.. మంగళవారం రాత్రి బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని క‌లిశారు. సంక్షోభంలో ఉన్న మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకునేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు. తిరుగుబాటు వర్గానికి చెందిన 39 మంది సేన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదని చెప్పడంతో శివసేన- ఎన్సీపీ-కాంగ్రెస్ అధికార సంకీర్ణం మైనారిటీలో ఉన్నట్లు మాజీ సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. 

Plastic Items Ban: జులై 1 నుంచే సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​పై​ నిషేధం.. అవి వాడితే క‌ఠిన చ‌ర్య‌లే..!

ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో బలపరీక్ష ద్వారా ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకోవాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ ఇచ్చామని తెలిపారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని మూడు పార్టీల MVA సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వ‌హిస్తున్నశివ‌సేన.. త‌న సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటును ఎదుర్కొంటోంది. క్యాబినెట్‌ మంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు అస్సాంలోని గౌహతిలో మకాం వేశారు. అక్క‌డ ఓ ల‌క్స‌రీ రిసార్ట్ లో దాదాపు వారం రోజులుగా ఉంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios