Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ : 71వ రోజుకు చేరిన రైతుల ఆందోళన..

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన 71వ రోజుకు చేరింది. సింఘు, టిక్రి, గాజీపుర్ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. 

protest by farmers at singhu border continues at delhi - bsb
Author
Hyderabad, First Published Feb 4, 2021, 10:10 AM IST

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన 71వ రోజుకు చేరింది. సింఘు, టిక్రి, గాజీపుర్ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. 

ఆందోళనల్లో పాల్గొంటున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జనవరి 26 ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడానికి నిరసనగా ఈ నెల 6న జాతీయ, రాష్ట్ర రహదారులు దిగ్భంధనం చేయాలని రైతు నేతలు పిలుపునిచ్చారు. 

చక్కా జామ్ పేరుతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రహదారులను దిగ్భంధించాలని నిర్ణయించారు. ఆందోళనలు తీవ్రం చేస్తామని రైతు నేతలు హెచ్చరించారు. కేంద్ర వ్యవసాయం చట్టాలను వెనక్కి తీసుకున్నాకే తిరిగి వెల్తామని స్పష్టం చేస్తున్నారు. 

మరోవైపు అంతర్జాతీయ ప్రముఖుల మద్ధతును రైతు సంఘాలు స్వాగతించాయి. కేంద్రం ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న దృష్ణ్యా సరిహద్దుల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

రహదారులపై బారికేడ్లు, సిమెంట్ దిమ్మలు అడ్డుగా పెట్టారు. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో పోలీసుల గస్తీ, ఆంక్షలు కొనసాగుతున్నాయి. సింఘు, టిక్రి, గాజీఫూర్ సరిహద్దులను పోలీసులు పూర్తిగా మూసివేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios