Asianet News TeluguAsianet News Telugu

ఇండియా గేట్ దగ్గర నిరసనలకు అనుమతించం: రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు

ఇండియా గేట్ వద్ద నిరసనలను అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు సూచించారు. వేరే ఏ ఇతర ప్రాంతంలోనైనా నిరసనలు చేయాలనుకుంటే ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో వేయడానికి హరిద్వార్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.
 

protest at india gate not allowed, delhi police tells to protesting wrestlers kms
Author
First Published May 30, 2023, 6:57 PM IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉండే ఇండియా గేట్ నిరసనలకు అతీతమైనదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఇండియా గేట్ వద్ద తాము ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని రెజ్లర్లు ఈ రోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు తమ మెడల్స్‌ను హరిద్వార్ వెళ్లి గంగా నదిలో కలిపి వస్తామని తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని సాక్షి మాలిక్ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఇండియా గేట్ నిరసనలకు వేదిక కాదని తెలిపారు. వారిని ఇక్కడ నిరసనలు చేయడానికి అనుమతించబోమని ఢిల్లీ పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఇది కాక వేరే ఏ ఇతర ప్రాంతంలోనైనా నిరసనలు చేయదలిస్తే.. తమ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవానలి ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు సుమన్ నల్వా తెలిపారు.

Also Read: మా పతకాలు గంగలో వేస్తాం.. ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్షకు దిగుతాం: రెజ్లర్లు

ఈ పతకాలే తమ జీవితాలు, తమ ఆత్మ అని ఆ ప్రకటనలో సాక్షి మాలిక్ తెలిపారు. తాము వీటిని గంగలో కలిపేస్తున్నామని, ఎందుకంటే.. ఆ నది గంగా మాత అని వివరించారు. ఆ తర్వాత మేం జీవించి ఉండే అవసరమే లేదని పేర్కొన్నారు. కాబట్టి, మరణించే వరకు ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్షకు కూర్చుంటామని వివరించారు. సాక్షి మాలిక్ 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

Also Read: ఇంట్లోనే బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది.. అప్పుడు బిడ్డ చేసిన దారుణమిదే

ఇక్కడ ఈ దేశంలో మహిళా రెజ్లర్లకు మిగిలిందేమీ లేదని సాక్షి మాలిక్ తెలిపారు. ఈ వ్యవస్థ తమను చాలా చీప్‌గా ట్రీట్ చేసిందని బాధపడ్డారు.

బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేసిన రెజ్లర్లు.. ఆయనను భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవి నుంచి తొలగిచాలని, ఎంపీగానూ అనర్హుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు పెట్టి లైంగిక ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లతో వారు ఏప్రిల్ 23వ తేదీ నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios