Asianet News TeluguAsianet News Telugu

జమ్మూలో అజాన్ పై నిరసన.. హనుమాన్ చాలీసా పఠించిన గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్లు.. అరెస్టు చేసిన పోలీసులు

లౌడ్ స్పీకర్ల వివాదం ఇప్పట్లో ముగిసేటట్టు కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న ఈ వివాదం తాజాగా జమ్మూలోనూ వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్లు లౌడ్ స్పీకర్లకు వినియోగానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. హనుమాన్ చాలీసా పఠించారు. 

Protest against Azan in Jammu .. Government college students reciting Hanuman Chalisa .. Arrested by police
Author
Jammu, First Published May 21, 2022, 8:48 AM IST

మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలన్న డిమాండ్ జమ్మూను కూడా తాకింది. జమ్మూలోని గవర్నమెంట్ సైన్స్ కళాశాల పక్కనే ఉన్న మసీదులో లౌడ్‌స్పీకర్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. లౌడ్‌స్పీకర్‌కు నిరసనగా కళాశాలలో విద్యార్థులు హనుమాన్‌ చాలీస్‌ పఠించడం ప్రారంభించారు. లౌడ్ స్పీకర్ల వల్ల చదువుకు ఆటంకం కలుగుతోందని, కాబట్టి వెంటనే వాటిని మసీదు నుండి డిమాండ్ చేశారు. కొందరు విద్యార్థులు నినాదాలు చేశారు. 

ప్రభుత్వ గాంధీ మెమోరియల్ కళాశాల విద్యార్థులు తరగతి గదుల్లో చదువుతున్నప్పుడు స్థానిక మసీదులో అజాన్ కోసం లౌడ్ స్పీకర్ ను ఉపయోగించారు. దీంతో చదువుకునేటప్పుడు తమకు ఇబ్బంది కలుగుతోందని స్టూడెంట్లు అందరూ ఒక్క సారిగా లౌడ్ స్పీకర్ వాడకానికి వ్యతిరేకంగా నిరసన చేప‌ట్టారు. మసీదు వద్ద లౌడ్ స్పీకర్ వాడకాన్ని ఆపడంలో అధికారులు విఫలం అయ్యార‌ని ఆరోపించారు. విద్యార్థులు హనుమాన్ చాలీసా జపం చేయ‌డం ప్రారంభించారు. 

షాకింగ్... తండ్రిని ముక్కలుగా నరికి, డ్రమ్ములో కుక్కి, భూమిలో పాతిపెట్టి.. ఓ కన్నకొడుకు దారుణం..

అయితే హనుమాన్ చాలీసా పారాయణం చేయకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు. అయితే అంతకు ముందు విద్యార్థులు మాట్లాడుతూ.. గత ఏడెనిమిదేళ్లుగా లౌడ్ స్పీకర్ల వల్ల ఇబ్బందులు త‌మ‌కు తీవ్ర ఎదురవుతున్నాయని అన్నారు. కానీ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవ‌డం లేద‌ని అన్నారు. వెంట‌నే లౌడ్ స్పీకర్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నామ‌ని చెప్పారు. విద్యాసంస్థల ప‌రిస‌రాల్లో లౌడ్ స్పీకర్లు ఉండకూడదని కొందరు విద్యార్థులు తెలిపారు. 

మతపరమైన, బహిరంగ ప్రదేశాల నుంచి అనుమతి లేకుండా పనిచేసే లౌడ్ స్పీకర్లు తొలగించాలని జమ్మూ మునిసిపల్ కార్పొరేషన్ (జేఎంసి) తీర్మానం చేసిన కొన్ని రోజుల తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ కౌన్సిలర్ నరోత్తమ్ శర్మ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ధ్వని కాలుష్యాన్ని నివారించడానికి జమ్మూలోని అన్ని మతపరమైన ప్రదేశాల నుండి చట్టవిరుద్ధమైన లౌడ్ స్పీకర్లు, ప‌బ్లిక్ అడ్ర‌స్ వ్య‌వ‌స్థ‌ల‌ను తొలగించాలని బీజేపీ కౌన్సిలర్ తన తీర్మానంలో డిమాండ్ చేశారు.

Har Ghar Dastak 2.0: హర్ ఘర్ దస్తక్ కరోనా వ్యాక్సిన్‌ ప్రచారానికి ప్రారంభించిన‌ కేంద్రం

అయితే ఈ ఘ‌ట‌న‌పై ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెస‌ర్ రవీంద్ర టిక్కూ మాట్లాడుతూ.. లౌడ్ స్పీకర్లను నిలిపివేయాలని విద్యార్థులు గతంలోనే క్లస్టర్ యూనివర్సిటీ జమ్మూలోని వీసీ, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఈ విషయాన్ని జమ్మూ డివిజనల్ కమిషనర్‌కు నివేదించార‌ని అన్నారు. కాగా ఇప్పుడు విద్యార్థులు ఆందోళ‌న చేప‌ట్టిన సైన్స్ కళాశాలకు జమ్మూలోని మంచి పేరుంది. ఇందులో ఇందులో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్క‌డ చ‌దువుకోవ‌డానికి మారుమూల మారుమూల, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు వ‌స్తుంటారు. 

దేశంలోని ప‌లు రాష్ట్రాల్లోని మ‌త ప‌ర‌మైన ప్ర‌దేశాల్లో లౌడ్ స్పీక‌ర్లు తొల‌గించాల‌ని చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ క‌ళాశాల‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ లౌడ్ స్పీక‌ర్ల వివాదాన్ని మొద‌ట‌గా మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ్ సేన పార్టీ అధినేత రాజ్ ఠాక్రే మొద‌లు పెట్టారు. రంజాన్ వ‌ర‌కు మ‌హారాష్ట్ర‌లోని మ‌సీదుల నుంచి లౌడ్ స్పీక‌ర్ల‌ను తొల‌గించ‌క‌పోతే, వాటి ముందు తమ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణం చేస్తామ‌ని ప్ర‌భుత్వాన్ని గ‌త నెల‌లో హెచ్చ‌రించారు. ఈ వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా దూమారాన్ని రేపాయి. అయితే ఇప్ప‌టికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ప‌లు  పలు రాష్ట్రాలు మతపరమైన ప్రదేశాల నుంచి అనధికారిక లౌడ్ స్పీకర్ల వాడకాన్ని నిషేధించాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios