మహారాష్ట్రలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. వేరే రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి గుట్టుగా ప్రాస్టిట్యూషన్ చేయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.
ముంబై : గుట్టుచప్పుడు కాకుండా థానే పట్టణంలోవ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన బిలాల్ కొకాన్ మోరల్ (26) అనే వ్యక్తి థానె, నవి ముంబై, ముంబై, పూణే, చెన్నై, గుజరాత్, ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ల నుంచి అమ్మాయిలను అక్రమంగా తీసుకువచ్చి.. గత కొద్ది రోజులుగా వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందింది.
వారు వెంటనే థానేలోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్ టీసీ) పోలీసులతో కలిసి వలపన్ని బిలాల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడి మీద ఐపీసీలోని పలు సెక్షన్ లతో పాటుగా మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం థానెలోని కోప్రీ పోలీస్ స్టేషన్ లో బిలాల్ ను ఉంచి.. మరింత సమాచారాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, మే 10న బెంగళూరులో ఇలాంటి హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. టాయిలెట్ లో రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే ఓ ముఠా గుట్టు వెలుగు చూసింది. ఈ మధ్యకాలంలో ఇతర రాష్ట్రాల వ్యభిచార ముఠాల వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకర్లు.. పోలీసుల కళ్లు గప్పేలా అతితెలివి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఓ చోట వ్యభిచారం చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకుని స్పెషల్ టీం రైడ్‌కు వెళ్లింది. అయితే ఆ సమయంలో గదుల్లో ఎంత వెతికినా ఏమీ కనిపించలేదు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీంట్లో భాగంగా బాత్రూంను పరిశీలించగా.. ఒక చోట నుంచి గురక శబ్దం వినిపించింది.
పోలీసుల కళ్లుగప్పి.. అపార్ట్ మెంట్ లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులు, నిర్వాహకురాలు అరెస్ట్..
శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో పరిశీలించిన ఓ అధికారికి టైల్స్ నుంచి వస్తున్నట్టుగా వినిపించింది. అనుమానంతో ఆయన టైల్స్‌పై చెయ్యి వేయగానే.. అది కాస్త పక్కకు జరిగింది. దీంతో లోపల ఏర్పాటు చేసిన చిన్న గది బయట పడింది. పోలీసులు గది తెరిచి చూడగా అందులో ఏర్పాటు చేసిన చిన్న సెల్లార్ కనిపించింది. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ పట్టుబడ్డారు. బయటికి చూడడానికి మామూలు ప్రదేశంలాగా కనిపించినా టాయిలెట్ లోపల ఇలా వ్యభిచార గృహం ఉండడం షాక్ కు గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ లోనూ ఇలాంటి ముఠా బయటపడింది. పోలీసుల కళ్లు గప్పి వ్యభిచార దందాలకు పాల్పడేవారు పెరిగిపోతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని పోలీసుల కళ్లుగప్పి బ్రోతల్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ దాడి చేశారు. ఫిజియోథెరపీ పేరుతో ఈ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్న సదాలక్ష్మి అనే నిర్వాహకురాలు ఆ ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తుండగా.. సమాచారం అందడంతో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు దాడి నిర్వహించారు. ముగ్గురు యువతులను పునరావాస కేంద్రానికి తరలించి.. సదాలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
