శంకర్ గఢ్ లోని సరూర్ గూంజ్ ప్రాంతానికి చెందిన కల్లు ఒక నిరుపేద దినసరి కూలీ. భార్య తీవ్ర అస్వస్థతకు గురవడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి సిబ్బంది పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పడంతో, మెరుగైన వైద్యం కోసం ప్రయాగ్ రాజ్ లోని స్వరూప్ రాణి నెహ్రు ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

అక్కడ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి ఆమె మరణించింది. భార్య శవాన్ని ఇంటికెలా తీసుకెళ్లాలో తెలియని సంకట స్థితి. వాహనం మాట్లాడుకొని 45 కిలోమీటర్ల దూరంలోని తన గ్రామానికి తీసుకెళ్లే ఆర్ధిక స్థోమత అతనికి లేదు. 

ఆసుపత్రి సిబ్బందిని తనకు ఒక వాహనాన్ని సమకూర్చాల్సిందిగా వేడుకున్నాడు, కానీ ఎటువంటి సహాయం లభించలేదు. భార్య ఆత్మగౌరవాన్ని ఎల్లవేళలా కాపాడుతానని పెళ్లినాడు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చిందేమో కాబోలు, వెళ్లి ఒక రిక్షా తెచ్చాడు. అందులో తన భార్య శవాన్ని పడుకోబెట్టి ఏకంగా 45 కిలోమీటర్ల దూరంలోని తన గ్రామం వరకు లాక్కొని వెళ్ళాడు.