Asianet News TeluguAsianet News Telugu

మైన‌ర్ బాలిక‌ల‌పై లైంగిక వేధింపులు.. లింగాయ‌త్ మ‌ఠాధిప‌తి అరెస్ట్.. 

కర్ణాటకలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ప్రముఖ లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న‌ను సోమవారం అరెస్టు చేశారు

Prominent Lingayat mutt seer Shivamurthy Murugha Sharanaru was detained in an alleged sexual assault case involving minors.
Author
First Published Aug 29, 2022, 2:38 PM IST

దేశంలో మ‌హిళ‌లు, చిన్నారుల ర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. దారుణమైన, క‌ఠిన‌ శిక్షలు విధించిన కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. చిన్న‌,పెద్ద అనే తేడా లేకుండా.. కామ పిశ‌సుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా.. కర్ణాటకలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ప్రముఖ లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న‌ను సోమవారం అరెస్టు చేశారు. కర్నాటకలోని చిత్రదుర్గలోని ప్రముఖ మురుగ మఠానికి ప్రధాన పీఠాధిపతి అయిన శివ‌మూర్తిని  హవేరి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మఠం నిర్వహిస్తున్న సంస్థలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వ‌చ్చాయి. 

మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు తమను లైంగిక వేధింపుల‌కు గురి చేశాడ‌ని లింగాయత్ మ‌త ఆశ్ర‌మంలో చ‌దువుకున్న‌ట్టున్న ఇద్దరు మైనర్లు మైసూరు నగర పోలీసుల‌ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా.. శివమూర్తి మురుగ శరణారావుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అతనిపై  పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మఠం నిర్వహిస్తున్న పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికల‌ను మైసూరు చెందిన ఎన్జీవో 'ఓడనాడి సేవా సంస్థ వారిని కాపాడింది. ఆ చిన్నారులు  ఎదురైన బాధను జిల్లా బాలల సంక్షేమ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. మ‌ఠాదిప‌తితో పాటు, సంస్థ వార్డెన్‌తో సహా మరో నలుగురిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఓడనాడి సేవా అనే ..ఎన్జీవో అక్రమ రవాణా, లైంగిక దోపిడీకి గురైన మహిళలు, పిల్లలను రక్షించడం, పునరావాసం, సాధికారత కోసం ప‌నిచేస్తుంది.  

 
మురుగ మఠం పరిధిలోని హాస్టల్‌లో ఉంటున్న ఇద్ద‌రు బాలికలను శివానంద మురుగ  మూడున్నరేళ్లుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.  కేవలం ఈ ఇద్దరు బాలిక‌లే కాదు.. ఈ విద్యాసంస్థలో చదువుతున్న అనేక మంది బాలికలను మఠాధిపతి  వేధిస్తున్నాడని ఎన్జీవో చైర్మెన్ స్టాన్లీ పేర్కొన్నారు. విద్యార్థుల‌పై  చాలా ఏళ్లుగా దారుణాలు జరుగుతాయని తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లకు, బెదిరింపులు వ‌చ్చినా తాము వెనక్కి త‌గ్గ‌బోమ‌ని, బాల‌ల హ‌క్క‌లు కాపాడ‌టం స‌మాజంలోని అంద‌రి బాధ్య‌త‌ని చెప్పారు.
 
కర్నాటక ప్రభుత్వం ఏం చెప్పింది?

ఈ ఘ‌ట‌న‌పై  కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై  స్పందించారు. ఈ కేసులో పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారని, దర్యాప్తు పూర్తయిన తర్వాత నిజం బయటపడుతుందని అన్నారు. చిత్రదుర్గలో పోక్సో, కిడ్నాప్ కేసు నమోదైంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ జరుగుతున్నప్పుడు దానిపై చర్చించడం సరికాదన్నారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెల్లడిస్తార‌ని తెలిపారు. బీజేపీకి చెందిన కేఎస్ ఈశ్వరప్ప ఆరోపణలపై తాను బాధపడ్డానని, ఆ వార్తలు అవాస్తవమని ప్రార్థిస్తున్నానని అన్నారు.

మురుగ మట్ హాస్టల్‌కు చెందిన ఇద్దరు మైనర్లను గేట్‌పాస్ తీసుకుంటున్నారనే నెపంతో కిడ్నాప్ చేశారని వార్డెన్ ఆరోపించారు. అనంతరం బెంగళూరులోని కాటన్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో దొరికారు.
మురుగ మఠం అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి బసవరాజన్ చిన్నారులపై, వార్డెన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

చిత్రదుర్గ పోలీసు సూపరింటెండెంట్ పరశురాం మాట్లాడుతూ..  చిత్రదుర్గ మురుగ మఠం బాలికల హాస్టల్ వార్డెన్ గ‌త నెల 27 న‌ ఇద్దరు మైనర్ బాలికలు గేట్ పాస్ తీసుకొని హాస్టల్ నుండి వెళ్లిపోయారని పోలీసు ఫిర్యాదు నమోదు చేశారు, అదే రోజు వారు కనిపించారు. బెంగళూరు కాటన్‌పేట పోలీస్‌స్టేషన్‌.. హాస్టల్‌ మాజీ అడ్మినిస్ట్రేటర్‌ ఎస్‌కే బసవరాజన్‌, ఆయన భార్య సౌభాగ్య బసవరాజన్‌ అక్రమ నిర్బంధంలో ఉన్నారు. అలాగే బసవరాజన్ వార్డెన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వార్డెన్ ఆరోపిస్తున్నారు. చిత్రదుర్గ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. .

Follow Us:
Download App:
  • android
  • ios