Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల్లో విజయం.. ఆనందంతో సంబరాలు చేశారో.. ఈసీ వార్నింగ్

విజయోత్సవాలు జరపడానికి వీలు లేదని పేర్కొంది. ఇప్పటికే ఈ విషయంలో ముందుగానే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయగా.. మరోసారి ఈ విషయంలో ఆంక్షలు విధించింది.

Prohibit victory celebrations urgently': Election Commission writes to Chief Secretaries
Author
Hyderabad, First Published May 2, 2021, 2:33 PM IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటికే పలు చోట్ల విజయం దాదాపు ఖరారు అయిపోయింది. దీంతో.. సంబరాలు చేసుకోవాలని ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ కౌంటింగ్ లో విజయాలపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ఎన్నికల్లో గెలుపొందిన పార్టీలు ఎటువంటి సంబరాలు చేయకూడదని ఆదేశించింది. ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్ర రూపంలో విజృంభిస్తున్న నేపథ్యంలో.. కీలక నిర్ణయాలు తీసుకుంది. విజయోత్సవాలు జరపడానికి వీలు లేదని పేర్కొంది. ఇప్పటికే ఈ విషయంలో ముందుగానే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయగా.. మరోసారి ఈ విషయంలో ఆంక్షలు విధించింది.

ఆదేశాలు పట్టించుకోకుండా ఎవరైనా విజయోత్సవాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  విజయోత్సవరాలు ర్యాలీలు నిర్వహించేవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్హెచ్ఓను సస్పెండ్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసీ ఆంక్షలు విధించినప్పటికీ.. కొందరు సంబరాలు నిర్వహించడానికి  సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios