Asianet News TeluguAsianet News Telugu

ప్రియాంక గాంధీ అనుగ్రహం ఎవరి మీద ఉందో..  వారికే ముఖ్యమంత్రి పీఠం ..!

గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ, హిమాచల్ ప్రదేశ్‌లోని 68 సీట్లలో 40 సీట్లను గెలుచుకుంది. అయితే.. తదుపరి సీఎం ఎవరు అనేది సర్వత్రా చర్చనీయంగా మారింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్తిని ఎనుకునే క్రమంలో ప్రియాంక గాంధీ నిర్ణయం కీలకంగా మారనున్నదని సమాచారం. ఆమె నివేదిక వచ్చినతర్వాతే ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని హైకమాండ్ ఖరారు చేస్తుందట.

Priyanka Gandhi Will Decide Himachal Pardesh New Chief Minister
Author
First Published Dec 10, 2022, 3:43 PM IST

గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ, హిమాచల్ ప్రదేశ్‌లోని 68 సీట్లలో 40 సీట్లను గెలుచుకుంది. ఈ విజయంతో బీజేపీని అధికారం నుంచి దింపి కాంగ్రెస్ అధికారం చేపట్టనున్నది.గుజరాత్‌లో ఘోర పరాజయం తర్వాత హిమాచల్‌లో కూడా కాంగ్రెస్‌ ఓటమి పాలైతే రానున్న కాలంలో కాంగ్రెస్‌కు సవాల్‌ మరింత పెరిగేది. హిమాచల్‌లో గెలవకపోతే ఎక్కడ గెలుస్తుందో... ఇది ఓ కాంగ్రెస్ నేత చేసిన ప్రకటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.

అయితే.. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించిన ప్రియాంక గాంధీ కూడా ప్రధానం కారణం. ప్రియాంక గాంధీతో పాటు రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లాపై కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన ప్రియాంక గాంధీ మరో కీలక బాధ్యత కూడా ఇచ్చారట.  సీఎం అభ్యర్థిని ఎన్నుకునే బాధ్యత ప్రియాంక గాంధీ మీద వేసినట్టు తెలుస్తుంది. ఆ నిర్ణయం ప్రకారమే.. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ప్రియాంక నిర్ణయం కీలకం కానున్నది.

ఇప్పటికే సీఎం రేసులో పలు సీనియర్ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్రకటన కోసం సర్వత్రా వేచి చూస్తున్నారు. రాష్ట్రంలోని 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం సాయంత్రం పార్టీ సాంప్రదాయ వన్‌లైన్ తీర్మానాన్ని ఆమోదించారు, నిర్ణయం తీసుకునేందుకు "హైకమాండ్"కు అధికారం ఇచ్చారు. ఆదివారం నాటికి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించారు. కొత్త జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆమె కూడా అనేక ర్యాలీలతో పాల్గొంది. ప్రియాంక కూడా ఎన్నికల కోసం అనేక వ్యూహాలు రచించడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీకి విజయాన్ని అందించడంలో , బిజెపి ఎన్నికల యంత్రాంగాన్ని ఓడించడంలో ఆమె నాయకత్వాన్ని పలువురు నాయకులు కొనియాడారు. ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక గాంధీకి ఇది తొలి ఎన్నికల విజయం. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆమె నాయకత్వం వహించినా.. పార్టీ పరాజయం పాలైంది. ఆమె పాల్గొన్న సిర్మూర్, కాంగ్రా, సోలన్,ఉనాలో ర్యాలీలలో.. అగ్నిపథ్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పాత పెన్షన్ స్కీమ్ సమస్యలను లేవనెత్తారు.
 
నిన్న సాయంత్రం కేంద్ర పర్యవేక్షకులు రాజీవ్ శుక్లా, భూపిందర్ హుడా, భూపేష్ బఘెల్‌లతో ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ప్రతి ఎమ్మెల్యేతో చర్చించారు. వారు ఎవరికి మద్దతు ఇస్తున్నారో తెలుసుకున్నారు. అయితే.. గాంధీ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ ..సీఎం రేసులో మొదటగా ఉన్నట్టు తెలుస్తుంది.  "హైకమాండ్" కూడా ఆమె వైపే మొగ్గు చూపే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం.  మూడుసార్లు ఎంపీగా ఉన్న ప్రతిభా సింగ్, మాజీ సీఎం దివంగత నేత వీరభద్ర సింగ్ భార్య ఆమె. సీఎం రేసులో ఆమెతో పాటు సుఖ్విందర్ సింగ్ సుఖు , ముఖేష్ అగ్నిహోత్రి కూడా ఉన్నారు. వీరిద్దరూ సిమ్లాకు కొంత దూరంలో ఉన్న ప్రాంతాలలో వారి మద్దతును కలిగి ఉన్నారు. ఈరోజు సమావేశం సిమ్లాలో జరిగినందున తరుపరి సీఎం పై క్లారిటీ రానున్నది.  

Follow Us:
Download App:
  • android
  • ios