Asianet News TeluguAsianet News Telugu

తేయాకు తోటలో కార్మికులతో పనిచేసిన ప్రియాంక గాంధీ

: తేయాకు తోటలో పనిచేస్తున్న కార్మికులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ కొద్దిసేపు తేయాకు తోటలో పనిచేశారు. తేయాకు తోటలో పనిచేస్తున్న కార్మికులను వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.

Priyanka Gandhi Vadra Tries Hand At Plucking Tea Leaves In Assam lns
Author
Assam, First Published Mar 2, 2021, 12:47 PM IST

డిస్‌పూర్: తేయాకు తోటలో పనిచేస్తున్న కార్మికులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ కొద్దిసేపు తేయాకు తోటలో పనిచేశారు. తేయాకు తోటలో పనిచేస్తున్న కార్మికులను వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.

అసోం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది.ఈ ఎన్నికల ప్రచారంలో ప్రియాంకగాంధీ పాల్గొంటున్నారు.  ఈ ప్రచారంలో పాల్గొనేందుకు అసోం వెళ్లిన ప్రియాంక తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులను కాంగ్రెస్ వైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేశారు.

 

రాష్ట్రంలోని సుమారు 40 నియోజకవర్గాల్లో తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు  గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు. దీంతో తేయకు తోటల్లో పనిచేసే కార్మికులను ఆకర్షించేందుకు ప్రియాంక ప్రయత్నించారు.

 

అస్సాంలోని బిశ్వనాథ్ లోని టీ గార్డెన్ లో తేయాకు తోటలో పనిచేసే కార్మికులతో కలిసి ఆమె కొద్దిసేపు పనిచేశారు. తేయాకు తోటలో ఎలా పని చేయాలి.. ఎన్ని గంటలు పనిచేస్తారు.. వారి కుటుంబ విశేషాలు కుష్ట నుఖాలను ప్రియాంక అడిగి తెలుసుకొన్నారు.

ప్రియాంక తేయాకు తోటలో కార్మికులతో పనిచేస్తున్న ఫోటోలను, వీడియోలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేసింది. తేయాకు తోటలో పనిచేసే కార్మికులు ఎలా బుట్టను ధరిస్తారో అలాగే ఆమె తన వీపుకు బుట్టను పెట్టుకొన్నారు. తలపై కండువా వేసుకొన్నారు. దానిపై బ్యాండ్ కట్టి ఉంది. 

తేయాకు ఆకులను ఎలా తీయాలో స్థానిక  కార్మికులను ఆమె అడిగి తెలుసుకొన్నారు. వారి చెప్పినట్టుగానే ఆమె తేయాకు ఆకులను తెంపి బుట్టలో వేశారు. తేయాకు తోటలోకి వెళ్లిన ప్రియాంకకు అక్కడ పనిచేసే కార్మికులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు.

రెండు రోజుల పాటు అసోంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మూడు విడతలుగా అసోంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి.సోమవారం నాడు అసోంకు చెందిన మహిళలతో కలిసి జమూరు డ్యాన్స్ చేశారు. లక్ష్మీపూర్ లో స్థానిక మహిళలతో కలిసి ఆమె నృత్యం చేశారు.ఎన్నికలకు ముందు తేయాకు తోటలో పనిచేసే కార్మికులకు రోజువారీ వేతనాన్ని రూ. 167 నుండి రూ. 217కి ప్రభుత్వం పెంచింది.

రాష్ట్రంలో సుమారు 10 లక్షల తేయాకు వర్కర్లు.. సుమారు 60 లక్షల మంది టీ తయారీ కమ్యూనిటీ ఉంటుంది. చాలా ఏళ్లుగా వీరంతా కాంగ్రెస్ వైపు ఉండేవారు. అయితే కాంగ్రెస్ నుండి వీరంతా బీజేపీకి మళ్లారు.

Follow Us:
Download App:
  • android
  • ios