న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ తనయుడు రైహాన్ రాజీవ్ వాద్రా ఓటేశారు. ఆయనకు ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కు వచ్చింది. తన తొలి ఓటు హక్కును ఆయన వాడుకున్నారు. ఆయన ఢిల్లీలోనీ లోథీ ఎస్టేట్ లో గల 114, 116 పోలింగ్ కేంద్రంలో తల్లిదండ్రులు ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రాలతో కలిసి ఆయన ఓటేశాడు. 

ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలు పంచుకోవడం తనకు మంచి అనుభూతిని కలిగించిందని ఆయన అన్నారు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని, విద్యార్థులకు సబ్సిడీ ఉండాలని ఆయన అన్నారు. 

 

రెజ్లర్ సుశీల్ కుమార్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాప్రోలా గ్రామంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.