కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రయాంకా గాంధీ తాజాగా ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు. కాగా.. ఆమె అలా ట్విట్టర్ లోకి అడుగుపెట్టారో లేదో.. ఆమె ఫాలోవర్స్ సంఖ్య వేలల్లోకి చేరింది. ఆదివారం ఆదివారం రాత్రి 10.45 గంటల సమయంలో ఆమె ట్విటర్‌ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. @priyankagandhi పేరుతో ఆమె ట్విటర్ అకౌంట్ యాక్టివేట్ అయింది. తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెరిఫైడ్ అకౌంట్‌గా ట్విటర్ గుర్తించడం విశేషం.

సోమవారం ఉదయం కల్లా ఆమె ఫాలోవర్స్ సంఖ్య 15వేలకు చేరింది. ఆమె ఫస్ట్ ట్వీట్ దేని గురించి చేస్తారా అని కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆమె ట్విట్టర్ లోకి అడుగుపెట్టిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది. గ్రెస్ మద్దతుదారులు ఆమెను ట్విటర్‌లో ఫాలో కావచ్చని ట్వీట్ చేసింది. 

సోషల్ మీడియా వాడకం పెరిగిపోతున్న సమయంలో కొత్తగా పలువురు ప్రముఖ నేతలు ట్విటర్ ఖాతాలను తెరుస్తున్నారు. గత నెలలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ట్విటర్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.